|| #అవతారపురుషుడవయ్య యుగపురుషుడవయ్య
పురుషోత్తముడవయ్యా శ్రీ వేంకటరామయ్యా ||
|| ప్రళయకాలపురుషుడవయ్య వఠపత్రబాలుడవయ్య
పద్మనాభుడవయ్యా బ్రహ్మకుజనకా
వైకుంఠవాసుడవయ్య శేషశయనుడవయ్య
వేదగోచరుడవయ్యా శ్రీ వేంకటరామయ్యా ||
|| శంఖుచక్రధారుడవయ్య శాస్జ్గగదాధరుడవయ్య
అసురాంతకుడవయ్యా గరుడగమనా
జగన్మోహనుడవయ్య శ్రీదేవిభూదేవిపతివయ్య
వీరశృంగారరూపుడవయ్యా శ్రీ వేంకటరామయ్యా ||
|| భక్తసులభుడవయ్య బంధవిమోచనుడవయ్య
సంసారపువార్ధివయ్యా సర్వేశ్వరుడా
భువనరక్షకుడవయ్య భూచరస్థితిపరుడవయ్య
సకలకళావల్లభుడవయ్యా శ్రీ వేంకటరామయ్యా ||
*ఓం నమో వేంకటేశ్వర నమో నమః*
*🌞శుభ శుభోదయం🌞*
#▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #శుభోదయం #శుభ శనివారం #తిరుమల

