మహాలయ అమావాస్య : కన్నవారిని కాదన్న వారిని పరమేశ్వరుడు కూడా ఇష్టపడడు. భగవంతుడి కన్నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అధిక ప్రాధాన్యమివ్వాలి. అందుకే పితృదేవతలను అర్చించి, వారికి ఉత్తమగతులు కలిగేలా మనిషిని ధర్మదీక్షాబద్ధుడిని చేసేందుకు కొన్ని నియమాలను మన శాస్త్రాలు విధించాయి. భాద్రపదమాసంలో బహుళ పక్షాన్ని (పూర్ణిమ తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు పదిహేను రోజుల కాలం) పితృపక్షం అంటారు. ఈ కాలం పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైంది. పితృపక్షంలో అన్ని వర్ణాల వారూ గతించిన తమ పితృదేవతలను తలుచుకుంటూ శ్రాద్ధవిధులను తప్పక నిర్వహించాలి. పితృపక్షం పుణ్యకార్యాలు చేయటానికి మంచిది కాదు.
పితృపక్షంలోని పదిహేను రోజులు పితృదేవతలకు సంబంధించిన శ్రాద్ధకర్మలు చేసేందుకు అత్యుత్తమమైనవి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గతించిన తర్వాత కూడా వారిని స్మరిస్తూ, వారికి అనంత పుణ్యలోకాలు ప్రాప్తించటానికి చేసే క్రతువు ఇది. వ్యాకరణ పరిభాష ప్రకారం శ్రాద్ధకర్మ అంటే శ్రద్ధతో చేసే కర్మ (పని) అని అర్థం. అంటే అత్యంత శ్రద్ధాభక్తులతో ఎవరి తల్లిదండ్రులకు వారు చేసే క్రియ ఇది. ఇక్కడ క్రియ లేదా ఆచారం కన్నా శ్రద్ధ, విశ్వాసం ముఖ్యం.
#📰సెప్టెంబర్ 21st అప్‌డేట్స్📣 #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #⚫మహాలయ అమావాస్య : ఇలా చేయండి..అన్ని కలిసి వస్తాయి #✌️నేటి నా స్టేటస్
