#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 *🙏శ్రీ సూర్య నారాయణస్వామి మేలుకొలుపు*🙏
*ఓం ఆదిదేవ నమస్తుభ్యం*
*ప్రసీద మమ భాస్కరా!*
*దివాకర నమస్తుభ్యం*
*ప్రభాకర నమోస్తుతే!!*
*శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్యనారాయణ*
పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయా
పొన్న పువ్వు మీద పొగడపువ్వు ఛాయా
శ్రీ సూర్యనారాయణా
ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయా
ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయా
శ్రీ సూర్యనారాయణా
గడియెక్కి భానుడు కంబ పువ్వు ఛాయా
కంబ పువ్వు మీద కాకారీ పూ ఛాయా
శ్రీ సూర్యనారాయణా
జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయా
జాజిపువ్వు మీద సంపంగి పూ ఛాయా
శ్రీ సూర్యనారాయణా
మధ్యాహ్న భానుడు మల్లె పువ్వు ఛాయా
మల్లెపువ్వు మీద మంకెన్నఁ పూ ఛాయా
శ్రీ సూర్యనారాయాణా
మూడు ఝాముల భానుడు ములగపువ్వు ఛాయా
ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయా
శ్రీ సూర్యనారాయణా
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయా
ఆవపువ్వు మీద అద్దంపు పొడి ఛాయా
శ్రీ సూర్యనారాయణా
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయా
వంగపువ్వు మీద వజ్రంపు పొడి ఛాయా
శ్రీ సూర్యనారాయణా
గుంకుతూ భానుడు గుమ్మడి పూ ఛాయా
గుమ్మడి పూ మీద కుంకంపు పొడి ఛాయా
శ్రీ సూర్యనారాయణా
🌞 *శ్రీ పద్మినీ ఉషా, ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణేనమః 🙏
🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻
