29th September 2025
మూల నక్షత్ర సరస్వతీ పూజ :
చదువుల తల్లిగా మనందరికీ పరిచయమైన సరస్వతీ దేవికి, దసరాల్లో మహాసరస్వతిగా పూజలందుకునే జగదంబకు కొంత వైవిధ్యం ఉంది. దేవీభాగవతం ప్రకారం శుంభ నిశుంభులను నిర్జించిన తల్లి మహాసరస్వతియే. అందుకే దసరాల్లో మూల నక్షత్రంనాడు మహాసరస్వతిని పూజిస్తారు. మూల నక్షత్రం సరస్వతీదేవికి జన్మనక్షత్రం అని భావిస్తారు. ఆమె అనంత చైతన్యస్వరూపిణి.
వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహనిగా, వీణాపాణిగా, పుస్తక మాలా ధారిణిగా కనిపిస్తుంటుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. 'శారద నీరదేందు ఘనసార పటీర' అంటూ అన్నీ తెల్లనైన వస్తువులతో బమ్మెర పోతన సరస్వతిని వర్ణించాడు. సరస్వతి ధరించే వీణ పేరు 'కచ్ఛపి'. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి రూపం ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ, భాషా జ్యోతిర్మయి, కళారస హృదయగా సరస్వతీ దేవి పూజలందుకొంటోంది. బాసర, కొలనుభారతి, వర్గల్ వంటి క్షేత్రాలలో సరస్వతీదేవి ప్రధానంగా కొలువుదీరి ఉంది.
#SaraswatiPooja #sribhakthitattvamofficial #VijayawadaDurgaTemple #moolanakshtram #KanakaDurgaDevi #exploremore #dasara2025 #🙏హ్యాపీ నవరాత్రి🌸 #📖శ్రీ సరస్వతి దేవి🎶 #🎉నవరాత్రి స్టేటస్🎊 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #🎶అమ్మవారి పాటలు, భజన్లు🙏 #📿నవరాత్రి పూజ విధానం🪔

00:23