ShareChat
click to see wallet page
నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులపై మీడియా సమావేశం – ఎమ్మెల్యే జారె 📅 29.09.2025 (సోమవారం) 📍 అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయం గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ఈరోజు అశ్వారావుపేట ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో గతంలో నిర్మించబడిన 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేసి ఇండ్లు కేటాయించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అశ్వారావుపేట కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ₹15 కోట్లు నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో చేపట్టబోయే ప్రధాన పనులు: ✅ నూతన మున్సిపాలిటీ భవనం ✅ ఆధునిక మున్సిపల్ మార్కెట్ ✅ పబ్లిక్ టాయిలెట్లు ✅ ట్యాంక్ బండ్ అభివృద్ధి ✅ దొంతికుంట చెరువు అభివృద్ధి ✅ సీసీ రోడ్లు & డ్రైనేజీలు అదేవిధంగా, అశ్వారావుపేట, దమ్మపేట, మందలపల్లి, చండ్రుగొండ బస్ స్టాండ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త బీటీ రోడ్లు, రైతుల కోసం గ్రావెల్ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం కోసం కూడా నిధులు సమీకరించామని, త్వరలోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు దమ్మపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి ఎమ్మార్వో రామకృష్ణ మున్సిపల్ కమిషనర్ నాగరాజు పలు శాఖల అధికారులు, మండల నాయకులు, జూపల్లి ప్రమోద్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
🔹కాంగ్రెస్ - ShareChat

More like this