ShareChat
click to see wallet page
#పాలిటిక్స్🏛️ *దేశంలోనే మన తెలుగు సీ ఎంలు నెంబర్ వన్...❗* AUGUST 23, 2025🎯 ప్రజలను పరిపాలించే నాయకుల్లో కొందరు కొన్ని విషయాల్లో నెంబర్వన్గా ఉంటారు. దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంటారు. పాలితులు అంటే సామాన్య జనాల కంటే పాలకులు సంపదలోగాని, నేరాల్లో గాని టాప్ ఉంటారు. రాజకీయాలకు సంపదకు, నేరాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ కాలంలో చాలా కొద్దిమంది నాయకులు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. ఏమీ లేనివాడు కూడా రాజకీయాల్లో చేరాక దండిగా డబ్బు సంపాదించుకుంటాడు. క్రిమినల్ కూడా మారతాడు. రాజకీయ నాయకులకు సంపద ఉండాలి. దాదాగిరి ఉండాలి. లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం. ఎన్నికల్లో డబ్బు దండిగా ఖర్చు చేసినా ఆ తరువాత దానికి రెండుమూడింతలు ఎక్కువగా సంపాదించుకుంటారు. పొలిటీషియన్స్కు సంపద, నేర చరిత్ర రెండూ ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. ఈ రెండు విషయాల్లో ప్రస్తుత తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ఆయన రాజకీయ శిష్యుడిగా పాపులరైన రేవంత్రెడ్డి ఇద్దరూ దేశంలోనే నెంబరవన్ ఉన్నారు. చంద్రబాబు సంపదలో నెంబర్వన్గా కాగా, రేవంత్రెడ్డి క్రిమినల్ కేసుల్లో నెంబర్వన్గా ఉన్నాడు. ముఖ్యమంత్రుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల సంపద, నేర చరిత్ర వివరాలను తెలియజేసింది. నేషనల్ ఎలక్షన్ వాచ్ తో కలిసి నివేదిక రూపొందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేసుల విషయంలో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్ గా నిలిచాడు. ఆయన మీద మొత్తంగా 89 కేసులు ఉండగా, వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొన్నది. నేరపూరిత బెదిరింపు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి ప్రేరేపించడం, ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, మతవిశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. చాలా మంది సీఎంల మీద పబ్లిక్ లో గొడవలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాగా, రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోస్థానంలో ఉన్నాడు. చంద్రబాబు మీద 19 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపదకు సంబంధించిన రికార్డు ని క్రియేట్ చేశాడు. దేశంలోనే ధనికులైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించాడు. మొత్తం 31 మంది సీఎంల అధికారిక ఆస్తుల వివరాలను లెక్కించారు. ఇందులో చంద్రబాబు కి అత్యధికంగా రూ.931 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఇది ఒక కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది. చంద్రబాబు గత కొన్నేళ్లుగా టెక్నాలజీ, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, కుటుంబ వ్యాపారాలు విస్తరించడం వల్ల ఆయన ఆస్తులు విపరీతంగా పెరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు - లోకేష్, భువనేశ్వరి వ్యాపారాల ద్వారానే ఎక్కువ ఆస్తులు సొంతం చేసుకున్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ. బాబు తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండ్ నిలుస్తున్నారు. ఆయన ఆస్తులు రూ.332 కోట్లు మాత్రమే. ఇక మూడో స్థానంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.51 కోట్లు మాత్రమే. అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. మొత్తం 31 ముఖ్యమంత్రుల ఆస్తి కలిపి రూ.1,630 కోట్లు ఉంది. వీరందరి ఆస్తి కలిపితే సగటున రూ.52.59 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికం. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది. ఆమెకు రూ.15 లక్షలు మాత్రమే. దీనిని బట్టి మన సీఎంల రేంజ్ అర్థం అవుతుంది. మొదట నుంచి ఆదాయపు వివరాలను బహిర్గతం చేయటం చంద్రబాబుకి అలవాటు. దీంతో అధికారిక ఆస్తుల్లో ఆయన నెంబర్ వన్ గా నిలిచారు. ఇక ఆస్తుల విషయంలో చంద్రబాబుతో పోలిస్తే రేవంత్రెడ్డికి బాగా తక్కువ. ఆయనకు సుమారు 30 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఒకప్పుడు రెండెకరాలు ఉన్న చంద్రబాబు ఇప్పుడు సంపద విషయంలో అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు నాయకులు రికార్డు సృష్టించారు.
పాలిటిక్స్ - ShareChat

More like this