ShareChat
click to see wallet page
*ప్రెస్ నోట్* *గుంటూరు జిల్లా పోలీస్…* *తేది: 07.12.2025* _*//రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి, రోడ్లపై మార్చ్ చేయించిన గుంటూరు ఈస్ట్ డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు,.//*_ 📍గుంటూరు జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలను చేపడుతోంది. దీనిలో భాగంగా, గుంటూరు ఈస్ట్ సబ్-డివిజన్ పరిధిలోని లాలాపేట, ఓల్డ్ గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సుమారు 150 మంది రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించబడింది. 🫟 అనంతరం, వారిలో చట్టబద్ధ జీవన విధానాన్ని అలవర్చేందుకు అవగాహన కల్పించేందుకు పోలీస్ పరేడ్ గ్రౌండ్–వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ –జిల్లా పోలీస్ కార్యాలయం–SBI బ్యాంక్ సెంటర్–పోలీస్ పరేడ్ గ్రౌండ్ మార్గంలో ప్రత్యేక మార్చ్ నిర్వహించారు. 👉 *డీఎస్పీ శ్రీ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ…* * చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వలన ఎదురయ్యే చట్టపరమైన శిక్షలు, వ్యక్తిగత భవిష్యత్తుపై వచ్చే ప్రతికూల ప్రభావాలు, కుటుంబాలపై ఏర్పడే మానసిక–ఆర్థిక భారం గురించి వివరించారు. * శాంతి భద్రతలను కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం అని, సమాజ అభివృద్ధికి ప్రతి పౌరుడు చట్టబద్ధతను అనుసరించడం అవసరమని సూచించారు. * రౌడీ షీటర్లు జీవితాల్లో మార్పుకు అవకాశాన్ని ఉపయోగించుకుని, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని సూచించారు. * ఉపాధి అవకాశాలను అన్వేషించి స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగాలని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టి శాంతి వాతావరణం నెలకొల్పడమే పోలీస్ శాఖ ధ్యేయమని తెలిపారు. 👉 *లాలాపేట సీఐ శ్రీ శివ ప్రసాద్ గారు మాట్లాడుతూ...* * నేర చరిత్ర చివరికి వ్యక్తిని నాశనానికి నెడుతుందని పేర్కొన్నారు. * సమాజంలో గౌరవం పొందాలంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. * ఇకపై నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పీడీ చట్టం సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ❇️ *ఓల్డ్ గుంటూరు సీఐ శ్రీ వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ...* * రౌడీ షీటర్లపై నిత్య పర్యవేక్షణ కొనసాగుతుందని, ప్రవర్తనలో మార్పులు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. * చట్ట ఉల్లంఘనపై సున్నా సహనం–Zero Tolerance విధానాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. * యువతను నేరాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. 👉 ఓల్డ్ గుంటూరు ఎస్సై శ్రీ రెహమాన్ గారు కౌన్సెలింగ్‌ కి హాజరైన రౌడీ షీటర్లతో నేర ప్రవర్తనకు దూరంగా ఉండటం, సత్ప్రవర్తన పాటించడం కోసం ప్రతిజ్ఞ చేయించారు. 👉 ఈ కార్యక్రమంలో ఈస్ట్ డిఎస్పీ గారితో పాటు లాలాపేట సీఐ శివ ప్రసాద్ గారు, ఓల్డ్ గుంటూరు సీఐ వెంకట ప్రసాద్ గారు, కొత్తపేట ఎస్సైలు రమేష్ గారు, సుబ్బారావు గారులు పాల్గొన్నారు. #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat

More like this