ఏసీఏ–ఎకో ఇన్నింగ్స్: సుస్థిరతకు నూతన ఆరంభం!వైజాగ్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా vs సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో ఏసీఏ–ఎకో ఇన్నింగ్స్ కార్యక్రమం ఆవిర్భవించిన తీరు మనందరికీ ఎంతో గర్వకారణం!స్టేడియంలో సమర్థవంతంగా అమలు చేసిన వ్యర్థ నిర్వహణ చర్యల కారణంగా, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో, ఉత్పత్తి అయ్యే చెత్త పరిమాణం భారీగా తగ్గింది. ముఖ్యంగా, అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో, ఈ కార్యక్రమం ఇంతటి విజయం సాధించింది.ఈ అద్భుతమైన అవగాహన కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లిన గీతం యూనివర్సిటీ విద్యార్థులకు నా హృదయపూర్వక అభినందనలు. వారి కృషి ప్రశంసనీయం.మనందరం కలిసి ఈ మ్యాచ్‌ను మరింత స్వచ్ఛతతో, భవిష్యత్తుకు భరోసానిచ్చేలా మార్చగలిగామని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను! ఈ స్ఫూర్తిని భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగిద్దాం. #🏏క్రికెట్ 🏏
00:30
