అనుక్షణం నను అనుసరించే
నీ చూపులు🥀💕
ఎపుడూ నా మనసును
వీడని నీ జ్ఞాపకాలు
ప్రతిక్షణం నాలో
మెదిలే నీ తలపులు🥀💕
ఎల్లపుడూ నా మదిని మీటే పూబాణాలు
కనులు మూసినా కనులు తెరిచినా
అదే రూపం కళ్ళలో కదలాడుతుంటే
మగత నిదురలో ఉన్నా🥀💕
నా కనులు కనే కలలన్ని
నీ కనులకు
చేరవేస్తుంటే.... 🥀💕
నీవు నా కనులలోనే దాగి ఉంటే
నీవు నా మనసంతా నిండి ఉంటే
నాకు ఎందుకో
ఈ తపన..... 🥀💕
నువు ఎల్లప్పుడు నాతోనే నాలోనే ఉంటే......
ఎక్కడో ఉన్నావని
ఎందుకో ఈ వేదన...
కలనైనా.....
కానగ రావా...... 🥀💕
నిను ప్రాణంగా ప్రేమించే
నీ కోసమే జీవించే
ఈ నెచ్చెలి కలత
తీర్చిపోవా🥀💕 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్
