ShareChat
click to see wallet page
*గీతా జయంతి* మార్గశిర శుధ్ధ ఏకాదశిని "గీతా జయంతి" గా జరుపుకుంటున్నాము. హిందువులకు ప్రత్యేకమైన పవిత్రగ్రంథం "శ్రీమద్భగవద్గీత"...గీతా మహత్మ్యం గురించి ఇప్పుదు తెలుసుకుందాము. *మలినే మోచనం పుంసాం జలస్నానం దినే దినే* *సకృద్ గీతామృతస్నానం సంసారమల నాశనం ||* ప్రతిదినము చేసే స్నానము వలన దేహముపైని మురికిని శుభ్రపరచుకోవచ్చును. కాని పవిత్రమైన భగవద్గీత అనెడి గంగాజలమున స్నానము చేసిన వాడు సంసార మాలిన్యము నుండి సంపూర్ణంగా ముక్తి నొందుచున్నాడు..అని గీతా మహాత్మ్యము తెలిపినది. *గీతా సుగీతా కర్తవ్యా కిం అన్య: శాస్త్ర విస్తరై:* *యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్ విని:సృతా: ||* భగవద్గీత అనునది శ్రీ కృష్ణ భగవానుని ముఖకమలము నుండి వెలువడినది కావున , మానవులు ఈ ఒక్కదానిని పఠించి, శ్రవణ, మనన , స్మరణము ల ద్వారా సాధన చేసిన చాలును... ఈ యుగమందు మానవులు లౌకిక ప్రయోజనార్ధులై ఉండుంట వలన వేద వాజ్ఞ్మయమును పఠింపలేరు...వారికి గీతగ్రంథ పారాయణమే ముక్తినొసగును. *భారతామృత సర్వస్వం విష్ణువక్త్రా ద్వినిసృతం* *గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే ||* గంగాజలమును సేవించిన వాడే పునర్జన్మ నుంచి ముక్తిని పొందుచుండ , భారతము నందు ప్రవచించబడిన గీతామృతమును గురించి చెప్పనేల? గంగా నది విష్ణు పాదముల నుండి, భగవద్గీత విష్ణు భగవానుని నోటి నుండి వెలువడినవి...అందువలన రేండూ ప్రతి మానవునకు పవిత్రములే.. *సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన:* *పార్థోవత్స: సుధీర్భోకా దుగ్ధం గీతామృతం మహత్ ||* సర్వోపనిషత్తుల సారమైన గోవు భగవద్గీత కాగా, గోపాలుడైన భగవానుడు ఆ క్షీరమును పితుకువాదు...అనగా ఆ సారమును మనకు అందిచువాడు. ఆ భగవద్గీతా సారమును పొందు అర్జునుడు గోవత్సము (దూడ) కాగా, పండితులు, భక్తులు, పరమ భాగవతులు,ఆ భగవద్గీతా క్షీరమును పానము చేయువారుగ నున్నారు. ఇటువంటి అద్భుతమైన మహాత్మ్యం కలది "శ్రీ మద్భగవద్గీత". ఈ గీతా జయంతి నాడు శ్రీ కృష్ణ భగవానుని స్మరించి గీతా పఠనం చేద్దాం.. *అందరికీ ముందుగా"గీతా జయంతి " శుభాకాంక్షలు.* ___________________________________________ HARI BABU.G __________________________________________ #గీతా జయంతి #భగవద్గీత #భగవద్గీత# గీతా సారాంశం #జై శ్రీ కృష్ణ #🌻🌻🌹#గీతా సారాంశం#🌹🌻🌻# #🙏🏻కృష్ణుడి భజనలు
గీతా జయంతి - గీతా జయంతి శుభాకాంక్షలు  దయచేసి షేర్చేయండి . సంభవామియుగే యుగే సంభవామి యుగీయుగా గీతా జయంతి శుభాకాంక్షలు  దయచేసి షేర్చేయండి . సంభవామియుగే యుగే సంభవామి యుగీయుగా - ShareChat

More like this