*_రాళ్లు కూడా పెరుగుతాయా?_*
*నంది విగ్రహం పెరుగుతోందంటే తప్పకుండా చిత్రమే. తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది. అయితే, దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది తెలుసుకోవాలంటే.. ముందుగా యూరప్‌లోని రోమేనియాలో ఎదిగే రాళ్లు గురించి తప్పకుండా తెలుసుకోవల్సిందే. ఈ రాళ్లు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు.. పిల్లలను కూడా పెడతాయి. ఇది వినడానికి చిత్రంగా ఉంది కదూ. అయితే, అదెలా సాధ్యమో చూడండి.*
*రోమేనియాలోని రాళ్లు ఏకంగా జీవిస్తాయని చెప్పవచ్చు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు పెరుగుతుంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లి రాయి నుంచి విడిపోతాయి. అవి మళ్లీ కిందపడి పెరుగుతాయి. వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే, వీటిలో జీవం ఉండదు. కేవలం రసాయానిక క్రియ వల్లే అది సాధ్యం. అదెలాగంటే..*
*రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి. కానీ, వర్షకాలం వచ్చేసరికి క్రమేనా ఎదుగుదల ప్రారంభం అవుతుంది. ఇందుకు కారణం.. ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్ల అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు క్రమేనా ఎదుగుతాయి. అయితే, రొమేనియా రాళ్లలో ఉన్న కాల్సియం కార్బొనేట్, సోడియం సిలికేట్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ, రోమానియా రాళ్లంత వేగంగా పెరగకపోవడం వెనుక చిన్న తేడా ఉంది*.
*తేమతోనే ఎదుగుతున్న యాగంటి నంది*
*రోమేనియా రాళ్లకీ, మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే.. రాళ్లలో కాల్షియం కార్బొనెట్ తక్కువగా ఉండి, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండటం వల్ల రోమానియా రాళ్లు వేగంగా పెరుగుతున్నాయి*. *కానీ, యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బొనేట్ పాళ్లు ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది*. *దీనివల్ల ఎదుగుదల నెమ్మదిగా ఉంటుంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండటం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవ్వుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు*.
*_సేకరణ:_* #మన సంప్రదాయాలు సమాచారం

