ShareChat
click to see wallet page
*శ్రీ దేవి శరన్నవరాత్రులలో తొమ్మిదవ రోజు బెజవాడ దుర్గమ్మ* *మహిషాసురమర్దిని గా దర్శనం యిస్తున్నారు....!!* 🌸🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌸🌿 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీ నవరాత్రులు జరుపు కుంటారు. తొమ్మిదవ వ రోజు అంటే ఆశ్వయుజ నవమిని మహర్నవమి. అమ్మవారి నవఅవతారాల్లో మహిషాసుర మర్ధిని దర్శనం..     నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శన మిచ్చారు. నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపు కుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది.  మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. అసాధారణమైన శక్తికలిగిన మహిషుడుని ఒంటరిగానే ఎదుర్కొంది జగన్మాత. అవతలి వ్యక్తి శక్తిని చూసి భయపడితే విజయం ఎప్పటికీ దూరంగానే ఉంటుందనే సత్యాన్ని మహిషాసురమర్దిని ఆచరణాత్మకంగా చూపిస్తుంది. మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ శ్లోకాన్ని పఠించాలి. నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పించాలి... 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏ఓం శ్రీ మాత్రే నమః🕉️ #🙏శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారు🕉️
☀️శుభ మధ్యాహ్నం - ShareChat

More like this