గెలుపు అనేది ఒకేసారి భువి నుండి ఊడిపడదు,అనేక వ్యయప్రయాసలుఅష్ట
కష్టాలు,ఈసడింపులు,ఆటుపోట్లు, ఛీత్కారాలు,ఎదురుదెబ్బలు చూసిన తరువాతే విజయం అనేది సంప్రాప్తిస్తుంది.అలాగే విజయం అనేది నల్లేరు మీద నడక కాదు,ఓక్క రాత్రికే వచ్చి పడేది అంతకంటే కాదు.అందుకు ఎంతో కాలం శ్రమ పడాలి, అంతకు మించి ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు సంవృద్ధిగా తోడవ్వాలి.
ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం,విజయం కోసం,విజయం అనే కిరీటం మన వశం కావాలంటే మాత్రం అహో రాత్రులు శ్రమించాల్సిందే,ఈ గొప్ప సూత్రమే విజయానికి బంగారు బాట అని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి.
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు! #🙏హ్యాపీ నవరాత్రి🌸
