ShareChat
click to see wallet page
#😇My Status #యమున నది విశేషాలు *యమున.....* *యమున సూర్యుడి కుమార్తె నదిగా మారింది. అది పుణ్యతీర్థమైంది. తల్లి మాటను అనుసరించి తపస్సు చేయడానికి బయలుదేరాడు ధ్రువుడు. అతడికి ఎదురైన నారదుడు ఆ బాలుడిని తపస్సు నుంచి మరల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినా ధ్రువుడి మనసు మారలేదు. పైగా తన తపస్సుకు తగిన ప్రదేశం సూచించమన్నాడు. ఆ బాలుడి పట్టుదల గమనించిన నారదుడు యమునాతీరం అనువైన ప్రదేశమని సూచించాడు. ఆయన ఆ ప్రదేశాన్ని సూచించడానికి ఎన్నో కారణాలున్నాయి. ఆ నది నీరు పవిత్రమైంది. సకల ఫుల పుష్పశోభితమైన మధువనం, పక్షి సమూహాల సందడితో అలరారే బృందావనం, సర్వ శుభ లక్షణ సమన్వితమైన గోసమూహానికి ఆలవాలమైన మధురానగరం, ప్రశాంత వాతావరణం, పవిత్రమైన ప్రకృతి... ఇలా ప్రాణి సమూహం ఆనందం, ఆరోగ్యాలతో జీవించడానికి అనుకూలమైన ప్రదేశమది. అందువల్ల భగవానుడు అక్కడ కొలువై ఉంటాడని సలహా ఇచ్చాడు నారదుడు.* *వసుదేవుడు కంసుడి బారినుంచి తన కుమారుణ్ని రక్షించుకోవడానికి ఈ నదిని దాటవలసి వస్తే- అది స్వచ్ఛందంగా రెండు పాయలుగా విడిపోయి దారి ఇచ్చింది. సకల సృష్టి నియంత్రకుడైన విష్ణు పాదాల స్పర్శ తనను తాకుతుందని, ఫలితంగా తాను పునీతనవుతానని యమున భావించడమే అందుకు కారణం. అంటే, విష్ణువు అవతారమే కృష్ణుడని అప్పటికే ఆమెకు తెలుసు. కృష్ణుడు దేవుడని లోకానికి చాటినదీ యమునే. ఆమె భక్తిభావం, అనురాగం ఎంతటివో తెలిసిన వాడు కృష్ణుడు. అందుకే యమునా తీరంతో అవినాభావ సంబంధాన్ని ఏర్పాటుచేసుకున్నాడు.* *లోకంలోని అరాచకాల్ని విష్ణువుకు విన్నవించడానికి, పురుషసూక్తం రూపంలో విష్ణువును స్తోత్రం చేస్తూ బ్రహ్మ సమాధి స్థితిలోకి వెళ్లిపోయాడు. 'ఓ చతుర్ముఖా! భూలోకవాసులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. అందుకే నేను వసుదేవుడి ఇంట పుత్రుడిగా అవతరిస్తున్నాను. నాకు ఈ అవతారంలో సహకరించడానికి దేవతలందరూ వారి వారి అంశలతో యాదవ వంశంలో అవతరించి నాకోసం వేచి ఉంటారు. దేవకన్యలంతా గోపికలుగా గోకులంలో అవతరిస్తారు. ఆదిశేషుడు బలరాముడిగా అవతరిస్తాడు. నా మాయావిలాసంతో లోకుల మాయామోహాలను తొలగించి ముక్తుల్ని చేస్తాను. వీటన్నింటికీ యమునా తీరం వేదిక కానుంది' అని పలికాడు.* *ఆ కారణంగానే ఆయన లీలామానుష విగ్రహుడయ్యాడు. అంటే, మానవుడిగా కనబడుతూనే దైవలీలలను ప్రదర్శించడం. అదీ ఆయన లీలల్లో ఒకటి. ఆయన అవతరించిందే లోకోద్ధరణ కోసం. అందుకోసం ఎక్కడికక్కడ తగిన రంగం సిద్ధం చేసుకున్నాడు. మన్ను తిన్న ఘట్టం, బృందావన విహారం, పశుపాలన విధానం, చెలికాళ్లతో గడిపిన తీరు, గోపికలను మురిపించిన విధానం, వారి పట్ల చిలిపి చేష్టలు, కలిగించిన మధురబాధలు, రేపిన మధురోహలు వంటివన్నీ ఎవరికి వారే మరీ మరీ తలచుకునే విధంగా ఉంటాయి.* *యమునా తీరాన్ని తన ఆట పాటల నుంచి ఆలనా పాలన వరకు, రాస క్రీడలు మొదలు, రాగద్వేషాలకు అతీతమైన స్థితి వరకు అన్నింటికీ ఆటపట్టుగా చేసుకోవడం లోక కల్యాణం కోసమే. బాల్యం నుంచి ఎక్కువ సమయం గడిపింది అక్కడే కావడం, వ్రేపల్లెవాసులు, బృందావన నివాసులు, గోవులు, గోపాలకులు, గోపికలు ఇష్టపడే ప్రదేశం సైతం యమునా తీరం కావడం- వీటన్నింటి కారణంగా అది కన్నయ్య చిరునామాగా మారింది. అంతటి గొప్ప ప్రదేశం కాబట్టి ఎందరో చక్రవర్తులు ఆ నది ఒడ్డున పుణ్యకార్యాలు చేశారు. అత్రి, భరద్వాజ, అగస్త్యుడు లాంటి మహర్షులు యాగాది క్రతువులు నిర్వహించారు. ఎందరెందరో ఎన్నో పుణ్య కార్యాలు చేసి తరించారు!* ❀꧁మాత్రేనమః꧂❀
😇My Status - ShareChat

More like this