ShareChat
click to see wallet page
ఇందిరా ఏకాదశి : ఇందిరా ఏకాదశినాడు ఉపవాసం, జాగరణ చేసినట్లయితే పితృదేవతలు తరిస్తారు. అశ్వమేధయాగంతో సమానమైన ఫలం కలిగిన ఏకాదశి ఇది. సత్యయుగంలో మాహిష్మతీ రాజ్యాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పాలించేవాడు. ధనధాన్య, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగిన ఆయన విష్ణుభక్తుడు. ఒకసారి నారద మహర్షి ఆయనకు దర్శనమిచ్చి, యమలోకంలో బాధలు పడుతున్న ఇంద్రసేనుని పితరులను గురించి తెలియచేశాడు. అప్పుడు ఇందిరా ఏకాదశి వ్రతం చేయడం ద్వారా ఇంద్రసేనుడు తన పితరులకు సద్గతులు కలిగించాడు. సాధారణంగా ఏకాదశీ వ్రతవిధానంలో ఉపవాస, జాగరణలుంటాయి. ద్వాదశి ఘడియలు ముగియకముందే అన్నసంతర్పణ చేసి, ఆ తరువాత భోజనం చేయాలి. అయితే ఇందిరా ఏకాదశి తరువాత వచ్చే ద్వాదశినాడు మాత్రం పితృతర్పణం, పిండప్రదానం కూడా విధిగా చేయాలి. __________________________________________ #📅 చరిత్రలో ఈ రోజు #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #ఏకాదశి #ఏకాదశి శుభాకాంక్షలు
📅 చరిత్రలో ఈ రోజు - auuuudsuta ಕಭSin5u] auuuudsuta ಕಭSin5u] - ShareChat

More like this