ShareChat
click to see wallet page
🌹🌿💐 షష్టి పూర్తి వివరణ 💐🌿🌹 __________________________________________ దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు (అంటే 60 ఏళ్లు) నిండినప్పుడు జరుపుకునే వేడుకనే షష్టి పూర్తి అని అంటారు. 🌹🌿💐✅ సాధారణంగా పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరిగినట్టే కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా చేయరు. ✅💐🌿🌹 నిజానికి మనిషి ఆయుర్దాయం 120 సంవత్సరములు. అందులో సగం అంటే 60 సంవత్సరాలలో తన జీవితంలో జరగవలసిన ముఖ్య ఘట్టాలన్నింటిని పూర్తి చేసుకుని తన జీవితంలో రెండవ అర్ధ భాగాన్ని ప్రారంభిస్తాడు. 🌹🌿💐✅ అయితే ప్రతివారికి మృత్యువు 60 వ యేట ఉగ్రరధునిగా, 70 వ యేట భీమరథునిగా , 78 వ యేట విజయరదునిగా , పొంచి వుంటాడు. ఈ వయస్సులలో కాళ్ళు , చేతులు లాంటి బాహ్య అవయవములు , గుండె , ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవములు , ఇంకా శరీరంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఆయా కుదుపులకు తట్టుకుని , మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి చేసే శాంతి ప్రక్రియ షష్టి పూర్తి. 💐🌿🌹✅ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి (గురుడు) 12 సంవత్సరముల కొకసారి తిరిగి తాను బయలుదేరిన స్థానానికి చేరుకుంటాడు. అలాగే శని గ్రహం 30 సంవత్సరముల కొకసారి 12 రాశులను చుట్టివస్తాడు. వీరిద్దరూ జన్మ కాలంలో ఉన్న రాశిని చేరటానికి 60 సంవత్సరములు పడుతుంది. ✅🌹🌿💐 మానవ జీవితంలో జరిగే మార్పులన్నింటికి మనం ఈ రెండు గ్రహాల గోచారం ద్వారా తెలుసుకోవచ్చు. శని , గురు గ్రహాలు తాము బయలుదేరిన రాశికి చేరుకోవడం తిరిగి జీవితం ప్రారంభం అయినట్లు సంకేతం. ఇంకొక విధంగా ఒక మనిషి పుట్టిన సంవత్సరం నుండి 60 తెలుగు సంవత్సరాలు ప్రకారం తిరిగి మరలా అదే సంవత్సరములో ప్రవేశించేరోజు షష్టి పూర్తి అని కూడా అంటారు. అంటే తన జీవితంలో ఒక అంకం ముగిసినట్టు అనుకోవచ్చు. 2 వ అంకం ప్రారంభమైనట్టు భావించాలి. 💐🌿🌹✅✅🌹🌿💐 ___________________________________________ HARI BABU.G ___________________________________________ #తెలుసుకుందాం #🔯దోష పరిహారాలు🔯 #✋జ్యోతిష్య పరిహారాలు♌ #✌️నేటి నా స్టేటస్ #😃మంచి మాటలు
తెలుసుకుందాం - ShareChat

More like this