ShareChat
click to see wallet page
*రాచూరుపల్లి వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె* 📅 02.10.2025 - గురువారం దమ్మపేట మండలం రాచూరుపల్లి గ్రామంలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు హాజరై విజేత జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. క్రీడలలో పాల్గొనడం వలన యువతలో మానసిక, శారీరక శక్తులు పెరుగుతాయని, సమాజంలో స్నేహభావం పెరుగుతుందని తెలిపారు. క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచే ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన రాచూరుపల్లి యూత్ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాకా రమేష్ గారు, మాజీ ఎంపీటీసీ నాయుడు శ్రీను గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరాముల ప్రసాద్ గారు, ముల్లపూడి వెంకటేశ్వరరావు గారు, మడకం రాజేష్ గారు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. #🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #🏛️రాజకీయాలు #కాంగ్రెస్
🔹కాంగ్రెస్ - దీపావశిశుభాకాంక్షలు మరియు రాచూరుపల్లియూతె @లో] దమ్మదివశ్చిము dol षdl దీపావశిశుభాకాంక్షలు మరియు రాచూరుపల్లియూతె @లో] దమ్మదివశ్చిము dol षdl - ShareChat

More like this