గ్రీస్‌లో యోగులచే నిర్మించబడిన 4200 ఏళ్ల నాటి ఆలయం | సద్గురు
A 4200-Year-Old Temple in Greece, Built by Yogis
గ్రీస్‌లో యోగులు నిర్మించిన 4200 ఏళ్ల పురాతన ఆలయం | సద్గురు
సద్గురు: గ్రీస్‌లో "భూనాభి" అని పిలిచే లింగం ఉన్న ఆలయం ఉంది. నేను చాలా ఏళ్ల క్రితం ఈ లింగం ఫోటో చూశాను, చూడగానే అది మణిపూరక చక్రమని గుర్తించాను. ఇది డెల్ఫీలో ఉందని చెప్పారు. అప్పటినుంచి అక్కడికి వెళ్లాలనుకుంటున్నాను, కానీ వెళ్ళడానికి 15 ఏళ్ళు పట్టింది.
ఈ లింగం పూర్తిగా మణిపూరక చక్రం. దీన్ని సుమారు 4200 ఏళ్ల క్రితం కచ్చితంగా భారతీయ యోగులు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి పాదరస గర్భం ఉండేది. ఏదో కారణం చేత, అక్కడ పరిస్థితులు తారుమారైనప్పుడు, ఆ పాదరసం విచ్ఛిన్నమైపోయింది. అందుకే, ఈ రోజు ఆ లింగానికి ఒక రంధ్రం ఉంది.
మణిపూరక లింగాన్ని ముఖ్యంగా ఆరోగ్యం, శ్రేయస్సు, సౌభాగ్యం కోసం సృష్టిస్తారు. బహుశా స్థానిక రాజు లేదా నాయకుడు విజయం, సౌభాగ్యం, శ్రేయస్సు కోరుకోవడం వల్ల, ఎవరో ఆ లింగాన్ని మణిపూరక కోసం ప్రతిష్ఠించి ఉంటారు. అందుకే, ఆ ఉద్దేశ్యంతో ఒక పరికరాన్ని సృష్టించారు. చాలా ఆలయాలకు రాజులే నిధులు సమకూర్చే వారు కాబట్టి, అవి ఎక్కువగా మణిపూరక స్వభావంతో ఉండేవి.
ఆ లింగంలో మణిపూరకాన్ని ఎంత శక్తివంతంగా ప్రతిష్ఠించారంటే, దాన్ని దాని అసలు చోటు నుండి తీసి మ్యూజియంలో పెట్టినా, ఇంకా అది కొంచెం పగిలినా, 4000 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ శక్తితో ప్రతిధ్వనిస్తోంది. ఎవరు చేశారో గానీ, అదొక అద్భుతమైన ప్రతిష్ఠ.
లింగాలను తయారుచేసే విజ్ఞానం ఒక గొప్ప అనుభవపూర్వకమైన సంభావ్యత, ఇది వేల ఏళ్లుగా ఉంది. రకరకాల ప్రయోజనాల కోసం వివిధ రకాల లింగాలను తయారు చేస్తారు. ఇది కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతీ సంస్కృతిలో, ప్రతీచోటా ఉండేది. గత 1800 ఏళ్లుగా, ప్రపంచవ్యాప్తంగా మతాన్ని చాలా దూకుడుగా వ్యాప్తి చేయడం వల్ల, ఇప్పుడది అంతగా కనిపించట్లేదు. కానీ చరిత్రను లోతుగా పరిశీలిస్తే, అది అన్నిచోట్లా ఉండేది. #sadhguru #SadhguruTelugu #life #linga #india
00:06
