*బ్రతుకు భారంగా మారిందా?*
*ఆ ఇంటి యజమాని మరణించిన తరువాత ఆ తల్లి కూతురు జీవనం కొనసాగంచడం బహు కష్టంగా మారింది. డబ్బులు లేక చేతులు ఖాళీ, వంట గదిలో గిన్నెలన్నీ ఖాళీ కాని గుండె నిండా విశ్వాసం మాత్రం వుంది . ప్రతీ దినము దేవుడు మా భారమును మోస్తానన్నాడు, ఖచ్చితముగా ఈ దినము కూడా దేవుడు మా భారం మోస్తాడు, మాకు మార్గం తెరచి, మాకు కావలసిన ఆహారము ఇస్తాడు అని విశ్వసించింది, ప్రార్థించింది. దేవుడు తప్పక పోషిస్తాడని నమ్మి దగ్గరలో ఉన్న ఒక కిరణా షాప్ వద్దకు వెళ్ళి, ఆ షాప్ ఓనర్‌తో - అయ్యా..! నాకు నెలజీతం రావాలి, ఇంకా రాలేదు, త్వరలో ఇస్తాం అంటున్నారు. కానీ చూస్తే ఇంట్లో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. నా దేవునికి ప్రార్థన చేసాను ఆయన తప్పక ఈ ఆర్థిక ఇబ్బందిలో నుంచి నన్ను తప్పిస్తాడు. అప్పుగా కొంచెం రొట్టె ఇస్తే నా కుమార్తెను పోషించుకుంటాను. నా నెలజీతం రాగానే తిరిగి చెల్లించేస్తాను, దయతో ఇస్తారా' అని అడిగెను.*
*ఇప్పుడా యజమాని- నీ దగ్గర చిల్లిగవ్వలేదు కానీ ప్రార్థన చేస్తాను దేవుడిస్తాడంటున్నావ్? ప్రార్థన చేస్తే మీ దేవుడు జవాబు ఇస్తాడా? అని ప్రశ్నించగా అయ్యా..! నా దేవుడు తప్పక ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఇందులో ఏ విధమైన సందేహం లేదు అని బదులిచ్చెను. అయితే ఒక పని చెయ్యి, నీవు నీ దేవునికి ఏం ప్రార్థన చేసావో ఒక చీటి మీద వ్రాసి నా కివ్వు ఆ ప్రార్థన ఎంత బరువు ఉంటే అంత రొట్టెను నీకిస్తాను. నీ దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడో లేదో చూస్తాను. అని ఆ యజమాని ఒక చీటి ఆ తల్లికి ఇచ్చెను. ఆ తల్లి అమాయకముగా ఆ చీటి మీద తన ప్రార్థనను వ్రాసి- అయ్యా..! నా దగ్గర ఏమి లేదు కానీ ఈ ప్రార్థన మాత్రం ఉది. ఇదిగో ప్రార్థన అని తక్కెటలో పెట్టింది.*
*అప్పుడా యజమాని రొట్టే పేకెట్లో ఉన్న ఒక చిన్న రాయి ముక్క తీసి ఆ తక్కెటలో రెండవ వైపు పెట్టాడు కాని తక్కెట ఏ మాత్రం కదలలేదు, కొంచెం భయంతో ఏమిటిది? అని అనుకొని ఇంకొక రొట్టే వేసాడు అయినా ఏ మాత్రం కదలిక లేదు. పేపర్ కన్నా రొట్టేనే బరువు ఉండాలి కదా..! ఇదేమీటి? అని అనుకొని ఒక్కొక్క రొట్టే వేస్తూ చివరికి పేకెట్ మొత్తం వేసాడు కానీ తక్కెట మాత్రం కొంచెం కూడా కదలలేదు. అప్పటికే ఆ షాప్ దగ్గర కొనడానికి వచ్చిన వారందరూ ఇదంతా విచిత్రముగా చూస్తున్నారు. తక్కెటలో ఎన్ని రొట్టెలు వేసినప్పటికి కొంచెం కూడా కదలలేదు. అందరి ముందు పరువు పోతుందని త్రాసులో ఉన్న రొట్టెలన్నీ ఒక సంచిలో వేసి అమ్మా..! ఇదిగో నీ రొట్టెలు తీసుకొని వెళ్ళు నీతో రేపు మాట్లాడుతానులే అని చెప్పి పంపించెను.*
*ఆ యజమాని మిగిలిన వారినందరినీ వారికి కావలసినవి ఇచ్చి పంపించి- ఎందుకని నా తక్కెట కదలలేదు. అసలామే ఏం ప్రార్థన చేసిందో చూద్దామని.. తక్కెటలో ఉన్న ప్రార్థన చీటి తెరచి చూడగా - తండ్రి..! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని వ్రాసి ఉంది. సరే..! వీళ్ళ దేవుడు వీరికి కావాల్సిన అనుదిన ఆహారము ఇచ్చాడు కానీ నా తక్కెట సంగతేమిటి..? అని చూడగా అది పైన మధ్యలో విరిగిపోయి ఉంది. గమనించండి! యేసుక్రీస్తు మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడయ్యడు.*
*''దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన చెప్పిచేయకుండున్నా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యా 23:19), సింహాపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు.'' (కీర్తన 34:10) మనము సింహపు పిల్లలకంటే శ్రేష్ఠులము కామా? కనుక ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకొందుమో అని చింతించక, మన కొరకు మన భవిష్యత్తు కొరకు చింతించు దేవుడు వున్నాడని విశ్వసించి ప్రశాంతముగా జీవిద్దాం. ''ఆయన మిమ్మిను గూర్చి చింతించుచున్నాడు.'' (1 పేతురు 5:7).* (దేవునితో ప్రతిదినం)
*************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://youtube.com/@calvarykiranalu?si=jrCqQ6F_9_-D_S1K
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
***********************************
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #jesu words #Jesus

