ShareChat
click to see wallet page
#🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬 *న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ గుర్తింపు* *పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం* *విశాఖపట్నంలో సీఐఐ సదస్సు విజయవంతం* *పెట్టుబడిదారుల విశ్వాసానికి కొత్త ఊపిరి* *వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు* *విశాఖపట్నం, నవంబర్ 15:* విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర GSDPలో 35 శాతం ప్రాథమిక రంగం నుంచే వస్తుందనడం ద్వారా వ్యవసాయ ప్రాధాన్యతకు మరోసారి నిదర్శనం లభించిందని చెప్పారు. వ్యవసాయ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులతో ఆంధ్రప్రదేశ్ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఫామ్ మెకనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం రైతుల ఖర్చులను భారీగా తగ్గించి, లాభదాయకతను పెంచుతోందని వివరించారు. రసాయనాలు లేని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు గల డిమాండ్ పెరుగుతుండటంతో, సహజ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తొమ్మిదేళ్ల క్రితం ముందుచూపుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన న్యాచురల్ ఫార్మింగ్, నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. *సీఐఐ సదస్సు పెట్టుబడుల ప్రవాహానికి శ్రీకారం* సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖామాత్యులు నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు యూఏఈలో, మంత్రి లోకేశ్ లండన్‌లో పెట్టుబడిదారులతో చేసిన చర్చలు రాష్ట్ర నమ్మకాన్ని పెంపొందించాయని తెలిపారు. రాష్ట్రం మరియు కేంద్రం మధ్య నెలకొన్న సత్సంబంధాల వల్ల పెట్టుబడులకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం కూడా పలు నిబంధనలను సడలిస్తూ సహకరిస్తోందని చెప్పారు. ‘One Call – One Deal’ భావనతో ప్రభుత్వం పనిచేస్తుండటం వలన పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘Speed of Doing Business’ విధానాన్ని అమలు చేస్తూ కేవలం 45 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే వ్యవస్థ అమల్లోకి వచ్చిందని తెలిపారు. *రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు* రెండు రోజుల సీఐఐ సదస్సు ఫలితంగా రాష్ట్రంలో రూ. 13 లక్షల కోట్లు పైబడిన పెట్టుబడులు సమకూరగా, 112 ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం రాష్ట్ర పురోగతికి శుభ సంకేతమని మంత్రి చెప్పారు. ఈ పెట్టుబడులు ఏపీ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, స్పేస్, డిఫెన్స్, టూరిజం వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు రావడం అభివృద్ధికి నాంది పలుకుతుందని వివరించారు. సదస్సుకు రెండు నెలల ముందుగానే సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు. #🟡తెలుగుదేశం పార్టీ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🆕Current అప్‌డేట్స్📢 #🟨నారా చంద్రబాబు నాయుడు
🗞️నవంబర్ 15th ముఖ్యాంశాలు💬 - ا PART SUMN Nove 77 FEFTHF 2835 ا PART SUMN Nove 77 FEFTHF 2835 - ShareChat

More like this