రిజిస్ట్రేషన్లలో అవకతవకలు ప్రజల పాలిట ఓక ఆశనిపాతంలా పరిణమించాయి!
లేదా
ఈ మధ్యకాలంలో దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్ల పరంపర ఉపందుకున్నది!
ఈ మధ్యకాలంలో ఏదైనా ఉమ్మడి స్థిరాస్తి విషయంలోనో లేదా సొంత స్థలాల విషయంలోనే దొడ్డిదారిన ఒకరికి తెలియకుండా మరొకరి ఆస్తిని రిజిస్టర్ చేయించుకోవడం అనేది ఓక సర్వ సాధారణ విషయంగా మారిపోవడం అత్యంత బాధాకరమైన విషయం.'మోసే గాడిద కూసే గాడిదను చెడగోడుతుంది ' ఆ విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకరి మించి మరొకరు అన్నట్లుగా లాభాలకు రుచి మరిగిన కొంతమంది కాసులకు కకృతి పడి చట్టవిరుద్దంగా వ్యవహారిస్తూ నలుగురికి చెందాల్సిన ఉమ్మడి ఆస్తులను ఎదో ఒకరి పేరిట మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తూ మిగతా అందరి జీవితాలతో ఆటలాడుకోవడం అనేది ఈ మధ్యకాలంలో అక్కడక్కడ అడపదడప కొన్ని కేసులలో మన కళ్ళ ముందు బయటపడుతూనే వుంది అనే మాట సత్య దూరం కాదు. ' చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ' తమ ఆస్తులు చట్ట విరుద్దంగా వేరే వారి పేరిట రిజిస్టర్ అయిన తరువాత ఎలాగోలా తెలుసుకొని లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ,రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తమ గోడు వెళ్ళబోసుకుంటూ వుంటారు బాధితులు.అయితే జరిగిన పొరపాటు గ్రహించి ఎవరైనా మధ్యవర్తుల ద్వారానో,పోలీసుస్టేషన్ల ద్వారానో తిరిగి వేరొకరి పేరిట రిజిస్టర్ అయిన తమ ఆస్తులను తమ పేరిట రిజిస్టర్ చేయించుకోవాలంటే వేలాది,లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దయనీయ పరిస్థితి నేటి సమాజంలో మనకు గొచరిస్తున్నది.దీనికి ప్రదాన కారణం రిజిస్ట్రేషన్ ఆఫీసులలో డబ్బు ప్రదాన పాత్ర పోషిస్తుండటం,'డబ్బుతో తిమ్మిని బమ్మి బమ్మీని తిమ్మి చేయొచ్చు ' అనే టక్కు టమరా విద్యలను బాగా నేర్చుకున్న కొంతమంది ప్రబుద్దులు ఇలా అడ్డదారిన ఇతరుల ఆస్తులను తమ పేరిట రిజిస్టర్ చేయించుకొని వికట్టహసం చేస్తూ వుంటారు.ఇలాంటి బడుద్దాయిలు చట్టం అనేది తమ చుట్టంగా భావిస్తూ వాటితో నిత్యం చెలగాట మాడుతూ అక్రమంగా ఆస్తులను కొల్లగోడుతూ వుంటారు.మరికొంతమంది నంగా నాచి కబుర్లు చెప్పే ప్రబుద్దులు ఇతరుల ఆస్తుల నకలును అక్రమ మార్గంలో సృష్టిస్తూ అవి తమ అబ్బ సొత్తుగా భావిస్తూ వారి ఆస్తులను తమ పేరిట రిజిస్టర్ చేసుకొని పైశాచిక ఆనందం పొందుతూ వుంటారు.ఇలాంటి వారి విషయంలో ఉమ్మడి ఆస్తులు వున్న ప్రతి ఒక్క ప్రజానీకం అప్రమత్తం కాకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.అలాంటి ఆందోళన, సంకట పరిస్థితులు తలెత్తకముందే నిద్రణావస్థ నుంచి సత్వరమే మేల్కొని ముందు జాగ్రత్త చర్యగా ఎవరికి చెందాల్సిన ఆస్తులు వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటే భవిష్యత్ లో ఎలాంటి సమస్య ఉత్పన్నం కాబోదు. ఎందుకంటే ఇది ఓక కలికాలం సొంత తమ్మున్ని,అన్నదమ్ములను,తోబుట్టువులను సైతం ఓక పట్టనా నమ్మలేని దారుణపరిస్థితులు నేటి సమాజంలో పొడచూపుతున్నాయి.కాబట్టి 'అలస్యం అమృతం విషం ' అనే మన పెద్దల నానుడిని ఎలాంటి పరిస్థితుల్లో పెడచెవిన పెట్టకుండా తక్షణమే ప్రతి ఒక్క ప్రజానీకం మేల్కొని లక్షలాది,కోట్లాది రూపాయలు చేసే ఉమ్మడి ఆస్తులను ఉన్న ఫలంగా కాపాడుకోండి.లేకపోతే అన్యాయంగా,చేజేతులారా మీ అమూల్యమైన ఉమ్మడి ఆస్తులను ఇతరులకు ఉడింగనం లేదా పరుల పాలు చేయాల్సి వస్తుంది.
ఏదిఏమైన మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు,పోలీసు యంత్రాంగం రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఎల్లావేళలా ప్రత్యేక నిఘా ఉంచి స్వంత,ఉమ్మడి ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా, ఒరిజినల్ గా ఆస్తులు వున్న ప్రజలు ఎలాంటి మోసాల,దగాల బారినపడకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ఎంతైన వారి భుజస్కందాలపై వుంది. ఏమైనా ప్రతి ఒక్క ప్రజానీకం కూడా తమ ఉమ్మడి ఆస్తుల విషయంలో ఎల్లవేళలా అత్యంత జాగురతతో వుంటూ పక్క వారు గాని,Gear బంధువులు గాని ఎవ్వరూ కూడా తమ ఆస్తులను పొరపాటున కూడా వారి పేరిట రిజిస్ట్రేషన్ కాకుండా అప్పుడప్పుడు వీలు చిక్కినప్పుడల్లా మీ ఆస్తులపై మీ సేవా కేంద్రంలో అడంగల్ ను తీయడమో లేదా ఈసి తీయడమో చేస్తే అందులో మీ స్వంత ఆస్తులను ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లేదో అనే విషయం అత్యంత స్పష్టంగా,అరటి పండు ఓలిచినట్లుగా మనకు కనపడుతుంది.ఈ తరహాలో ప్రజలు తమ స్వంత ఆస్తులను కాపాడుకునే విషయంలో అత్యంత శ్రద్ధాశక్తులు కనబరచకుంటే మాత్రం భవిష్యత్ లో మీకు అనవసర సమస్యలు,ఎనలేని,భరించలేని ఇబ్బందులు #l #🔊తెలుగు చాట్‌రూమ్😍 ఎదురవ్వడం తథ్యం.తస్మాత్ జాగ్రత్త!అదమరిస్తే మన ఆస్తులు గంగ పాలే ✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
