ShareChat
click to see wallet page
మార్గశిరమాసం ప్రారంభం : చంద్రుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో చరించే మాసం మార్గశిరం. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో ప్రతీక్షణం ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిరం లక్ష్మీదేవికి ఇష్టమేనని భక్తుల విశ్వాసం. అందుకే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ భక్తితో ఆచరిస్తారు. వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ నెలంతా తెలవారక ముందే తెలిమంచులోనే ఇళ్లముందు పేడకళ్లాపి చల్లి, రంగవల్లులు తీర్చి దిద్దుతూ గొబ్బెమ్మలు పెట్టే కన్నె పిల్లలతో వీధులన్నీ కళకళ లాడిపోతుంటాయి. మార్గశిర మాసానికున్న మరో ప్రత్యేకత. మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందన్నారు. తదియనాడు ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు. చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు. పంచమినాడు చేసే నాగపంచమి వ్రతం, మర్నాడు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి అందరికీ తెలిసిందే. శుద్ధ సప్తమి నాడు సూర్యారాధన పేరుతో ఆ ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తారు. మార్గశిర శుద్ధ అష్టమిని ‘కాలభైవాష్టమి’ గా వ్యవహరిస్తారు. ఏకాదశి తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఒకవేళ అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి (వైకుంఠ ఏకాదశి) అవుతుంది __________________________________________ HARI BABU.G __________________________________________ #మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం #ముక్తికి మార్గం మార్గశిర మాసం #మోక్షానికి మార్గం మార్గశిర మాసం #మార్గశిర మాసం ప్రాశస్త్యం 🕉️ విశిష్ట పండుగల మాసం 🪔మహావిష్ణు ప్రీతికరంమైన మార్గశిర మాసం మోక్షదాయిని #మార్గశిర మాసం
మార్గశిర మాసం 🕉️ విశిష్ట పండుగల మాసం - ٥٥٥٥٢٥٥5٥ య్రరంధి శుభాకంక్షలు ٥٥٥٥٢٥٥5٥ య్రరంధి శుభాకంక్షలు - ShareChat

More like this