ShareChat
click to see wallet page
#దేవి శరన్నవరాత్రులు అయిదవరోజు శ్రీ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణలో అమ్మవారి దర్శనం #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #💐శ్రీ మహాలక్ష్మి దేవి✨ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత దసరా దుర్గ నవరాత్రులలో ఐదవరోజు శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మ అలంకారణ. అమ్మవారి అలంకారణ : నేడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మిదేవిగా అలంకరించాలి. అమ్మ చీర రంగు : గులాబీ రంగు శారీ, Rose కలర్ శారీ. నైవేద్యం : రవ్వ కేసరి. పారాయణం : శ్రీ సూక్తం, శ్రీ మహాలక్ష్శి స్రోత్త్రాలు, శ్రీ మహాలక్ష్మి అష్టకం. తెల్లని, ఎరుపు రంగు పువ్వులతో పూజించి, శ్రీ మహాలక్ష్మి అష్టొత్తరం పఠించాలి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తు ఉండగా శ్రీమహాలక్ష్మి దర్శనమిస్తుంది. ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల రూపమే శ్రీమహాలక్ష్మి దేవి. ఈమే క్షీరాబ్ది పుత్రిక. డోలారుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవత. శక్తి త్రయంలో ఈమే మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసన చేస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో ఆశక్తే "లక్ష్మీ" ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 'ఇవి నా విభుతులూ' అని విభుతి యోగంలో చెప్పినవన్ని లక్ష్మీ స్వరూపాలే. ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్నే కోరుకుంటారు. అయితే తన బిడ్డల సంగతి తెలుసు కనుక, విద్యాగంధం లేనివాడు అజ్ఞానవశాన ధనాన్ని చెడుపనులకు ఉపయోగించి, పాపాలను మూటకట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి, ఆ తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లిని ఐశ్వర్య ప్రదాయిని అని అన్నారు. సూర్య, చంద్ర, అగ్ని, వాయువు, భూమి మొదలు అయినవన్నీ ఐశ్వర్యాలే. ఈ ఐశ్వర్యాలకు కారణమైన పర బ్రహ్మ శక్తి ఐశ్వర్య రూపిణి లక్ష్మిదేవి. హృదయం నిండుగా భావన చేస్తే అమంగళాలకు చోటు ఉండదు. డబ్బుకు లోటు ఉండదు. చిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి. అందుకే ఆ తల్లి తత్వాన్ని గ్రహించి అందుకు తగినట్లుగా మసులుకుంటే ఏ సమస్యలు దరికి రావు. శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైన వాటిలల్లో లక్ష్మీ కొలవు అయ్యి ఉంటుంది. ఆవునెయ్యితో గాని సువర్ణ జలంతో కాని లక్ష్మీ దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి శరన్నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సర్వమాంగళ్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి అష్టకం : నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే| శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే ||1|| నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 || సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 3 || సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని | మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 4 || ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి | యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌స్తు తే || 5 || స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే| మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 6 || పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 7 || శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 8 || మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః | సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ | ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః || త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ | మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా || ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్. శ్రీ సూక్తం : ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ | చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ | యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ || అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ | శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ || కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ | పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్|| చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టాముదారామ్ | తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ‌లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః | తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః || ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ | ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే || క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్| అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ || గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ | ఈశ్వరీగ్‍మ్ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్|| మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి | పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః|| కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ | శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ || ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే | ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే || ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్ | సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలామ్ పద్మమాలినీమ్ | చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్ | యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో ‌శ్వాన్, విందేయం పురుషానహమ్ || ఓం మహాదేవ్యై చవిద్మహే విష్ణుపత్నీ చ ధీమహి | తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ || శ్రీ-ర్వర్చస్వ-మాయుష్య-మారోగ్యమావీధాత్ పవమానం మహీయతే | ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః|| ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః #namashivaya777
దేవి శరన్నవరాత్రులు అయిదవరోజు శ్రీ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణలో అమ్మవారి దర్శనం - g App ఈ రోజు అమ్మవారి అలంకరణ మహాలక్ష్మీదేవి శ్రీ PSVAPPARAO g App ఈ రోజు అమ్మవారి అలంకరణ మహాలక్ష్మీదేవి శ్రీ PSVAPPARAO - ShareChat

More like this