ShareChat
click to see wallet page
#శుభ కార్తీక మాసం - ఈ మాసంలో జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: ఉత్పన్న ఏకాదశి ఆదికేశవుల పరమ పవిత్ర పుణ్య దినం 🕉️🔱🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఏకాదశి *ఉత్పన్న ఏకాదశి* *ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా...* కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి, ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి. ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది... అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు... సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను, ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి. ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు. ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత: ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో 'భవవ్యోత్తర పురాణం' వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు. 'సంక్రాంతి' వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి అతని / ఆమె పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణం తరువాత 'వైకుంఠం' విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారు. వేయి ఆవులను దాతృత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశిలో ఉపవాసం హిందూ మతం యొక్క మూడు ప్రధాన దేవతలు బ్రహ్మ , విష్ణు , మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం. అందువల్ల హిందూ భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో, ఉత్సాహంగా పాటిస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
శుభ కార్తీక మాసం - ఈ మాసంలో  జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు - లధ్యాశ్ిక రినిందం ఉత్పన్న ఏకాదని ಸುಭಾತಾಂತಲು [OO Daily Wish Telugu 0+91 9700 722 711  లధ్యాశ్ిక రినిందం ఉత్పన్న ఏకాదని ಸುಭಾತಾಂತಲು [OO Daily Wish Telugu 0+91 9700 722 711 - ShareChat

More like this