*_6️⃣3️⃣_*
*_సంపూర్ణ మహాభారతము_*
*_63 వ రోజు_*
*వికర్ణుడు*
*దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు “ఈ సభలో ఉన్న కురువృద్ధులు, గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి.* *ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా?” అన్నాడు*.
*ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు “నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం,విషయాసక్తి దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు పాండవుల ఉమ్మడి భార్య అయిన ద్రౌపదిని తను ముందు ఓడి తర్వాత ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా శకునియే ద్రౌపదిని పణంగా పెట్టే విషయాన్నీ ప్రస్తావించాడు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం” అన్నాడు*. *కర్ణుడు వికర్ణుని చూసి “ఎందుకీ అధిక ప్రసంగం? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు" అన్నాడు.*
*అపుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు “కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా! ద్రౌపది పాడవుల వస్త్రాలు తీసుకో" అన్నాడు.*
*దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగనారంభించాడుడు.*
*ద్రౌపది శ్రీకృష్ణుడిని “గోవిందా! కృష్ణా! ద్వారకా వాసా! గోపీజనప్రియా! కేశవా! నన్ను ఉద్దరించవా!” అని మాటిమాటికి పిలుస్తూ ముఖాన్ని కప్పుకుని రోదించింది.*
*శ్రీకృష్ణుడు అదృశ్యుడై వివిధ సుందర వస్త్రాలతో ద్రౌపదిని అచ్ఛాదించాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. లాగిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. దుశ్శాసనుడు ఇక చేతగాక అలసిపోయి సభామధ్యంలో సిగ్గుతో కూలబడ్డాడు*.
*ఇది చూసి భీముడు ఆగ్రహంతో*
*“కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపదిని ఇలా అవమానించిన దుశ్శాశనుని* *సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు"అని భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు*.
*సభలోని వారు “కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు" అని అనుకున్నారు*. #మన సంప్రదాయాలు సమాచారం
