#విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪
*హోదా లాగానే ఉక్కు కూడానా❓*
SEPTEMBER 2, 2025🎯
ఏపీకి ఒకటి పోయింది. రెండవది డౌట్లో పడింది. కానీ జరుగుతున్న వ్యవహారం చూస్తే కనుక మొదటి దానిలాగానే అంతా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. అలా 2014లో కేంద్రంలో బీజేపీ ఏపీలో టీడీపీ మిత్రపక్షాలు గదెనెక్కాయి. మూడేళ్ళ పాటు హోదా అదిగో ఇదిగో... హోదా ఎక్కడికీ పోదు అన్నది. చివరికి తెలింది ఏమిటి అన్నది అందరికీ తెలిసిందే. హోదా పోయింది.
తమాషా ఏమిటి అంటే ప్రత్యేక హోదా అన్న అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాసం తెలుగుదేశం పార్టీ పెట్టింది. కానీ 2024 ఎన్నికల ముందు విశ్వాసం వచ్చేసింది. పాచిపోయిన లడ్డూలు అంటూ ప్రత్యేక ప్యాకేజి గురించి మాట్లాడిన జనసేన కూడా ఆ తరువాత ప్రత్యేక హోదా ఊసే ఎత్తలేదు.
ఇపుడు చూస్తే అచ్చం అదే సన్నివేశం అగుపిస్తోంది. విశాఖ ఉక్కు ఎక్కడికీ పోదు అంటున్నారు. ప్రైవేట్ పరం కానే కాదు అని అంటున్నారు. ఒక పక్క చూస్తే కీలక విభాగాలు అన్నీ ప్రైవేట్ పరం అవుతున్నా అంతా బాగుంది అన్నట్లుగా దేవతా వస్త్రాల కధలను వినిపిస్తున్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని నిలబెట్టుకుంటామన్న మాటలు అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఆనాడు ప్రత్యేక హోదా విషయంలో వారిని వీరు వీరిని వారు అంతా అనుకుని చివరికి ముంచేశారు. అన్నీ గల్లీ పోరాటాలే చేశారు తప్ప అంతా కలసి ఒక్కటిగా ఢిల్లీ వరకూ వెళ్ళి నిలదీయలేదు.
ఇపుడు కూడా ఉక్కు విషయంలో టీడీపీ స్థానంలో వైసీపీ వచ్చి విమర్శలు చేస్తోంది. పోరాటాలకు సిద్ధం అంటోంది. అయితే ఈ పోరాటాలు అన్నీ గల్లీలోనే ఎందుకు ఢిల్లీకి అంతా కలసి ఒక్కటిగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయరాదా అన్నది జనం మాటగా ఉంది ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అంతా కలిసి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. బీజేపీకి అన్నింటా వెన్నంటి ఉంటున్నారు.
బీజేపీ బలం లేకపోయినా ఏపీ ఎంపీల బలంతోనే కేంద్రంలో అధికారంలో ఉంది అన్నది కూడా తెలిసిందే. ఇంతలా ఏపీ మీద ఆధారపడిన కేంద్రాన్ని ఆ ఒక్కటీ తీర్చరూ విశాఖ ఉక్కుని మా హక్కుగా వదిలేయరూ అని ఎందుకు ముచ్చటకు అయినా అడగలేకపోతున్నారు అన్నదే అంతా మాట్లాడుకుంటున్న విషయం. నిన్న హోదా పోయింది నేడు ఉక్కు సంగతి అంతేనా అన్న సందేహాలు
వస్తున్నాయంటే ఏపీ రాజకీయ పార్టీల అంతా బాగుంది అంటూ ఊరిస్తూ చెబుతున్న మాటలే అంటున్నారు.
![విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 - మ] న LLLI1 0@8 ٢ ٢٥ 05) Nlfl 00619 MMU క్టి ఫానా చగారిన ಡರ್ಯ 0 8)3? మ] న LLLI1 0@8 ٢ ٢٥ 05) Nlfl 00619 MMU క్టి ఫానా చగారిన ಡರ್ಯ 0 8)3? - ShareChat విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪 - మ] న LLLI1 0@8 ٢ ٢٥ 05) Nlfl 00619 MMU క్టి ఫానా చగారిన ಡರ್ಯ 0 8)3? మ] న LLLI1 0@8 ٢ ٢٥ 05) Nlfl 00619 MMU క్టి ఫానా చగారిన ಡರ್ಯ 0 8)3? - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_773208_70c3010_1756795771968_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=968_sc.jpg)
