Viral Video: ట్రైన్ ఢీకొని గాయపడిన ఏనుగు.. పట్టాల పక్కన నొప్పితో విలవిలా..
అనేక అటవీ ప్రాంతాల మధ్య నుంచి రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రాక్స్ మీద నుంచి జంతువులు వెళ్తుంటే.. అదే సమయంలో ఏదైనా హై స్పీడ్ ట్రైన్ వస్తే.. ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగాఏనుగుల గుంపు లేదా ఒకే ఏనుగు ప్రయాణిస్తున్నప్పుడు.. హైస్పీడ్ రైళ్లు తగిలి తరచుగా ప్రమాదాలకు కారణమవుతాయి. ప్రస్తుతం ఒక వీడియో ఏనుగుకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అది చూడడానికి హృదయ విదారకంగా ఉంది.