ShareChat
click to see wallet page
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌸పంచాంగం🌸 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 25 - 10 - 2025, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్ల పక్షం, తిథి : *చవితి* రా12.01 వరకు, నక్షత్రం : *జ్యేష్ఠ* పూర్తి యోగం : *శోభనం* తె5.34 వరకు, కరణం : *వణిజ* ఉ11.02 వరకు తదుపరి *భద్ర* రా12.01 వరకు, వర్జ్యం : *మ12.02 - 1.48* దుర్ముహూర్తము : *ఉ5.59 - 7.31* అమృతకాలం : *రా10.37 - 12.23* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *తుల* చంద్రరాశి : *వృశ్చికం* సూర్యోదయం : *5.59* సూర్యాస్తమయం : *5.31* *_నేటి విశేషం_* *నాగుల చవితి* _కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ!_ _ఋతుపర్ణస్య రాజర్షే: కీర్తనం కలినాశనమ్!!_ _ఈ శ్లోకాన్ని నాగులచవితినాడు పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని పురాణ వచనం_ నాగులచవితికి నాగన్న.. స్నానం సంధ్యలు నాగన్న... పువ్వులు పడగలు నాగన్న... మడిబట్టలతో నాగన్న..' అంటూ తెలుగువారు నాగులచవితి పండుగను నియమ నిష్ఠలతో ఆచరిస్తారు. పుట్టలో పాలుపోసి ఉపవాసవ్రతాలు ఆచరిస్తారు, నాగులచవితి పర్వం వెనుక అంతరార్థం, సంప్రదాయ విశిష్టతలు ఎన్నో ఉన్నాయి. నాగారాధన అనాది యుగాలనుంచి కొన్ని ప్రాంతాంలో కొనసాగుతోంది. కార్తికశుద్ధ చవితినాడు నాగులచవితి జరుపుకోవటం ఆచారం. మన శరీరమే నవరంధ్రాల పుట్ట. అందులో పామురూపంలో ఉండే కుండలినీశక్తిని ఆరాధించడమే నాగులచవితి. శరీరమనే పుట్టలో అడుగున మండలాకారంలో మూడున్నర చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము ఉద్రేకముతో విషం కక్కుతూ ఉంటుంది. పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు అని లౌకిక అర్ధంలో చెప్పడమే. నాగులచవితి ప్రయోజనం, నాగుల చవితినాటి రాత్రినుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంతశయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కానవస్తుంది. ఇది ఉత్థానఏకాదశి వరకూ ఎనిమిదిరోజుల పాటు ఆకాశంలో కనిపించే అద్భుత దృశ్యం. అలాగే కార్తికమాసంలో సూర్యుడు మృత్యువుకు స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఆ సమయంలో నాగారాధన వల్ల మృత్యువును జయించే సిద్ధి కలుగుతుంది. అందుకే కార్తికమాసమంతా నాగారాధన ప్రత్యేకంగా చేస్తారు. నాగులచవితికి పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాల వంటి నూలుదారాలతో పుట్టలను అలంకరిస్తారు. చిన్నచిన్న వెండిరేకుల్ని పుట్టకి పెట్టి 'పుట్టాకళ్ళు' అలంకరిస్తారు. “నాగులచవితికి నాగన్నా నీ పుట్టనిండా పాలుపోసేము తండ్రీ! నీ పుట్టదరికి మా పాపలొచ్చేరు. పొరపాటున 'తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నడిచిపో! పడగ తొక్కితే పారిపో! మమ్మల్ని, మా సంతానాన్ని కాపాడు" అంటూ పుట్టలో పాలుపోస్తారు. ప్రదక్షిణ నమస్కారాలు చేస్తారు, చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్లు, తాటి బుర్రగుజ్జు, తేగలు వంటివి నివేదన చేస్తారు". సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు శ్రేష్ఠం. సర్పారాధన చేసే వారి వంశం తామరతంపరగా వర్ధిల్లుతుందని భవిష్యపురాణం చెప్తోంది. నాగేంద్రుడిని స్త్రీలు ఆరాధిస్తే శుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతుంది. వివాహం కానివారు ఆరాధిస్తే యోగ్యుడైన భర్త లభిస్తాడని విశ్వాసం: సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్పపూజ చేయడం ఆనవాయితీ. పుట్ట మట్టిని 'పుట్టబంగారం' అంటారు. కొద్దిగా పుట్టమట్టి చెవి దగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు తొలగిపోతాయి. నాగులచవితికి ఉపవాసం చేసి స్వామికి నివేదించిన చిమ్మిలి, చలిమిడినే అల్పాహారంగా తింటారు. నువ్వులు, బెల్లంతో చేసిన చిమ్మిలి, చలిమిడి చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. "నూకలిస్తా మూకనియ్యి... పిల్లలమూక నాకియ్యి" అంటూ సంతానం కోరే వారు పుట్టలో పాలతో పాటు నూకవేసి వేదుకుంటారు. అన్ని ఆలయాల్లో నాగారాధన విశేషంగా జరుగుతుంది. పామును చంపిన పాపం తొలగిపోవడానికి తైత్తిరీయసంహిత నాగపూజావిధానం వివరించింది. పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కాపాడతాయి. సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా నాగులను పూజించడం మన ఆచారం, పుట్టలో సోసే పాలు పాములు తాగవని అందరికీ తెలిసిన సత్యం, అయితే నాగులచవితినాడు మనం పుట్టలో వేసే పిండిపదార్ధాలు, నువ్వులు, బెల్లం ఇతర పదార్థాలు తినేందుకు క్రిములు చేరతాయి. వాటిని తినడానికి కప్పలు, ఎలుకలు ఆ పుట్టల్లోకి చేరతాయి, అవి పాములకు ఆహారంగా మారతాయి. అలా కొద్దిగా పుట్టమట్టి చెవి పాములు తమ నివాసాల నుంచి బయటకు రాకుండానే వాటిస్థానాల్లోనే ఆహారం లభిస్తుంది. ఫలితంగా పాములకు ప్రాణహాని వాటివలన మనకు హాని రాకుండా నివారించగలుగుతున్నాం. ఇలా ఎలుకలను ఎరవేసి పట్టించడం వల్ల రైతులకు పంటనష్టం కూడా తగ్గుతుంది, పాముల సహజ నివాసాలను ఉండనిచ్చి, ప్రకృతిని కాపాడుకునే విశిష్ట పర్వం నాగులచవితి. *┈┉┅━❀ ॐ ❀━┅┉┈ * *_🌸శుభమస్తు🌸_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - 25/10/25 இ హనుమాన్ శుభశనివాఠం ಐಭ್ದಯೂ నాగులచవితి శుభాకాంక్షలు 25/10/25 இ హనుమాన్ శుభశనివాఠం ಐಭ್ದಯೂ నాగులచవితి శుభాకాంక్షలు - ShareChat

More like this