ShareChat
click to see wallet page
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 3🌷🌷* *"మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు" ( 1 పేతురు 2:5)* మనమే ఆ సామగ్రి - " సజీవమైన రాళ్ళ" తో ప్రభువు తన నివాస స్థలమును కట్టుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించిన దినముననే ఆయన జీవము మనలో పోయబడును. మన ప్రభువే " నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు" అని చెప్పుచున్నాడు. మనము నిత్య జీవమును కలిగి యున్నాము గనుక సజీవమైన రాళ్లు అని పిలువబడుచున్నాము. దేవుడు తన ఆత్మీయ ఇంటిని కట్టుటలో సామాగ్రిగా మనలను వాడుచున్నాడు గనుక మనము రాళ్లు అని పిలువబడితిమి. ఒకరు నిత్య జీవము కలిగియుంటేనే తప్ప క్రైస్తవుడని పిలువబడే హక్కులేదు, దేవుని ఇంటిలో భాగముగా కూడా కాలేరు. దేవుడు మనలను తన నివాస స్థలముగా కట్టవలెనని కోరుట మాత్రమే గాక మనము ఆ నివాస స్థలముగా ఉండవలెనని కూడా కోరుచున్నారు. మానవ మాత్రులమైన మనమే నివసించుటకు, మనలను ప్రేమించి, ధారాళముగా ప్రేమించబడుటకు ఒక ఇల్లు కావలెనని కోరుదుము. అలాగే దేవుడు కూడా తాను నివసించి, మనలను ప్రేమించి, మన ద్వారా ప్రేమించబడుటకు ఒక ఆత్మీయ గృహమును కోరుచున్నారు. దేవుడు ప్రేమయై యున్నాడు. ప్రేమ దేవుని ముఖ్యమైన గుణము, అది శాశ్వతమైనది. విశ్వవ్యాప్తమైనది, త్యాగ సహితమైనది, మార్పు చెందనిది మరియు మన మానవ గ్రాహ్యమునకు మించినది. మనము ఆయనకు నిత్యమైన నివాస స్థలముగా ఆయనచే కట్టబడవలెనని కోరుచున్నాడనునది అద్భుతము కాదా? ఇంటి నిర్మాణములో రాళ్లను వాడునప్పుడు, మొదట అవి బండనుండి కొట్టబడవలెను, తరువాత సరియైన ఉద్దేశము కొరకు వాటిని ఆ ప్రత్యేక స్థలములో ఉంచుటకు సరిపోవునట్లు చెక్కవలెను. అలాగే మనము కూడా ముఖ్యమైన ఆయన మచ్చులో చక్కగా అమర్చబడునట్లు ప్రభువు కూడా మనలను కొట్టి, చెక్కవలసియున్నది. ప్రేమతో ఆయన చెక్కుచున్నప్పుడు మనము అప్పగించు కొనుటకు నేర్చుకొనిన యెడల ఇతర "సజీవ రాళ్ళ" తో సమాధానముగా జీవించగలము. అనేక మంది విశ్వాసులకు ఇతర విశ్వాసులతో కలసి జీవించుట కష్టముగా ఉండును. వారు సమాధానముగా, సంతోషముగా తమకు తాము వేరుగా ఒకమూల నివసించుదురు. అయితే వారికి ఇతరులతో జీవించుటకు కష్టముగా ఉండును, చాలా చిన్నవాటికి కూడా కలహించుదురు. మనము ఇతర విశ్వాసులతో సమాధానముగా జీవించునప్పుడు దేవుని ఇంటి కొరకైన ఆయన మచ్చును అర్థము చేసికొను మంచి స్థితిలో ఉందుము మరియు మన ప్రయాస అత్యధికముగా ఫలవంతమగును. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝

More like this