ఈ రోజు మా 26వ వివాహ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని! ( 11-10- 1999 - 2025)!
సరిగ్గా ఈరోజుతో మా వివాహం జరిగి ఇరవై ఐయిదు సంవత్సరాలు గడిచి పోయు 26వ సంవత్సరంలోకి అడుగిడినాము అంటే మాకు నమ్మశక్యము కావట్లేదు.ఎందుకంటే కాలం అనేది ఓక నిరంతర ప్రవాహం వంటిది,ఆ కాలం అనేది అత్యంత వేగంగా మున్ముందుకు దూసుకుపోతూ ఉంటుంది,ఆ అనంత కాల ప్రవాహంలో మనం ఎన్నో చేదు,తీపి అనుభవాలు చవిచూసి ఉంటాము.ఎన్నో,మరెన్నో విజయాలను,అపజయాలను,గెలుపు ఓటములను ఎదుర్కొని ఉంటాం.అలాగే కాలం అనేది ఓక కొవ్వతిని వెలిగిస్తే ఎలా కరిగిపోతు ఉంటుందో అలా మన జీవిత కాలం కళ్లుమూసి తెరిచే లోగా ముగిసిపోతూ ఉంటుంది,దీన్ని ఆపడం ఎవరి తరము కాదు.కాబట్టి మనం జీవించి నన్ని రోజులు ఎలాంటి చీకు చింతలు లేకుండా దైవ చింతనలో,ఆధ్యాత్మిక పంథాలో సంతృప్తిగా జీవిస్తే అదే మనకు పది వేలు,వెయ్యి జన్మల పుణ్యఫలం కూడా!
ఏదిఏమైనా మన పెద్దలు సెలవిచ్చినట్లుగా వివాహబంధం అనేది నూరేళ్ళ మంట లాగా కాకుండా నూరేళ్ళ పంట లాగా మన విలువైన,అమూల్యమైన జీవితాలు అనోన్యంగా సాగిపోవాలి.అలా కాకుండా వివాహబందాన్ని మనం దురదృష్టవశాత్తు నూరేళ్ళ మంటలాగా చేసుకుంటే మాత్రం మనకు చిక్కులు, ఇబ్బందులు తప్పవు.కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ వివాహబంధాన్ని విచ్చిన్నం చేసుకోకుండా చాలా దృడంగా,పది కాలాల పాటు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లేటట్లు చేసుకోవాలని మా సవినయ,హృదయపూర్వక మనవి!
- బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #పెళ్లిరోజు
