ఎన్ని కారు మబ్బులు
వర్షించినా🍁
సముద్రమంత అగాధం ఉన్న హృదయం
ఉప్పొంగి కన్నీరులా ప్రవహించినా
పగలు రాత్రి మరచి
అదే పనిగా విలపించినా
మనసుకు చేసిన గాయం
మానిపోయేదా🍁
గాయపడిన హృదయం
గతస్మృతులను విడిచేనా
దారి అన్నది కానరాక అలుముకున్న చీకట్లలో చీకటిలా కలిసిపోయి
వెలుగు రేకలు చూడలేని
కనులు కన్నీరుతో
మసకబారినా🍁
కన్నీటి చారల గురుతులతో
బాధ గొంతుని దిగమింగుకొని
కొత్తదారి కోసం అన్వేషించినా
విధి చేసిన వింత గాయం
ముళ్ళులా గుచ్చుతున్నా
ఏదో ఆలోచన తనువును
నిలువెల్లా దహించివేస్తున్నా
పరధ్యానమే ఒక ధ్యానమై🍁
మనసును
మరో లోకంలోకి నెట్టేస్తుంటే
అలుపు లేని
కనులు నిదుర మరచి
ఎదురు చూపులకు లోకువై
ఎంతకీ గమ్యాన్ని చేరుకోలేక
ఆశనిరాశల సంఘర్షణలో
బంధాలను తెంచుకోలేక🍁
కొత్తబంధాలను సృష్టించుకోలేక
ఇలా సాగిపోని జీవితం ఇలా
ఎడారిలో కోయిలలా.....
ఎండమామిలో నావలా.....🍁 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్