🙏 ఓం నమో శ్రీ లక్ష్మీ నారసింహాయ ! నమో నమః🙏
" ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామిని శ్రీ గంధంతో అలంకరించిన దృశ్యం "
ధర్మ పురిని దర్శిస్తే యమపురి ఉండదని శాస్త్ర వాక్కు...
శేషప్ప కవి విరచిత నరసింహ శతకం పద్యం
****************************** తల్లిగర్భమునుండిధనము తేడెవ్వడు,
వెళ్లిపోయెడినాడువెంటరాదు;
లక్షాధికారైన లవణమన్నమె కాని,
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు,
విత్త మార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని,
కూడఁబెట్టిన సొమ్ము గుడువఁబోడు;
పొందుగా మఱుగైన భూమిలోపలఁ బెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి,
తుదకు దొంగల కిత్తురో? దొరల కవునో?
తేనె జుంటీఁగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
ఓ భూషణవికాస! నరసింహా!
పుట్టినప్పుడు తన తల్లి గర్భం నుండి ఏ విధమైన ధనం తీసుకురాడు. అలాగే పోయేటప్పుడు కూడా పట్టుకుపోడు. ఎంత ధనవంతుడైనా తనజానెడు పొట్టకు ఉప్పు కలిసిన మెతుకులేగానీ సంపాదించిన బంగారాన్ని మ్రింగబోడు. నేనింత సంపాదించానని గర్వపడతాడే గానీ, తను కూడబెట్టిన సొమ్మును తినలేడు. దాన ధర్మాలు చేయక ధరణిలో దాచిన ఆ ధనం తుదకు దొంగలకిస్తారో లేక దొరలపాలగునో ఎవరికెఱుక. తేనెటీగలు కష్టపడి తాము దాచిన తేనెను తెరువరల కిచ్చుటలేదా? (అనగా బాటసారుల పాలగుతున్నదని భావం) కావునా దానధర్మాలు చేసిన సొమ్ము మాత్రమే ధరణిలో కీర్తించబడును.
#🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం #🙏శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి #🙏🏻భక్తి సమాచారం😲 #🔱🪔ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి 🔱🪔
