ఎన్నెన్ని అందమైన ఆశలో
కడలిలో అలలై పొంగుతుంటే💕
వాటికి ఆనకట్ట వేయలేకున్నా
నా మనసులో భావాలు
నీతో ఎన్ని పంచుతున్నా💕
ఇంకా ఎన్నో మిగిలి ఉంటుంటే
ఏం చేయలేకున్నా
కళ్ళల్లోనే కలలన్ని జారిపోయి
నీ చెంత వాలుతుంటే💕
ఏం తోచకున్నా
ఆ గగనాన మెరిసే తారలన్ని
నీ కలలై వచ్చి ఎదుటే నిలిచి
నిజమైపోతుంటే💕
నా పున్నమి చంద్రుడు ఇలా వచ్చి
ఒడిలో వాలి
ఎన్నెన్నో కథలు చెబుతూ ఉంటే
అలా కనుతెరచి చూసే లోపు💕
నీవు లేక నిదుర రాక
ఇది కలనేనా అని తెలిసి
నాలో నేను నవ్వుకున్నా💕 #✍️కవితలు #💘ప్రేమ కవితలు 💟 #🖋️నేటి కవితల స్టేటస్