ShareChat
click to see wallet page
పొగాకూ, పంచదారా, లంగ్ క్యాన్సర్! మోకాలికీ బోడి గుండుకూ ముడేసినట్టు వుందా? మీరు వింటున్నది నిజమే. పొగాకు స్థూలంగా రెండు రకాలు. నాటు పొగాకు (బర్లీ) దొర పొగాకు (వర్జీనియా). బర్లీ పొగాకును పంచదార ద్రావణంలో నానబెట్టి ఆరబెడితే (సాసింగ్) అది ఏభై శాతం పంచదారను పీల్చుకుంటుంది. ఇలా పీల్చుకున్న దానికి నికోటిన్ అనే విషాన్ని మోసుకెళ్లే గుణం పెరుగుతుంది. నికోటిన్ కి వ్యసనంగా మార్చే గుణం వుంది. (అందుకే ధూమపానం అనారోగ్యం అని “బాధ్యత” బాగా ఎక్కువ మోతాదులో కలిగిన ప్రభుత్వాలు సిగరెట్ పెట్టెల మీదా, సిన్మా యాడ్స్ లోనూ రాయిస్తాయి. అటువైపు, సిగరెట్టు కంపెనీలకు కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తాయి!) 1929 నాటి లెక్కల ప్రకారం సాలినా తయారయ్యే 12 వేల కోట్ల సిగరెట్ల తయారీకి ఐదు కోట్ల పౌండ్ల పంచదార వాడేవాళ్లట. నిజానికి పంచదార కలపని పొగాకు ఇంత తీవ్రమైన ప్రమాద కారకం కాదు! సిగరెట్ పరిశ్రమ ఇంతగా విస్తరించడంలో పంచదార పాత్ర చాలా కీలకమైందని పంచదార పరిశోధక ఫౌండేషన్ వాళ్ళూ, అమెరికన్ వ్యవసాయ శాఖా రెండూ నిర్ధారించాయి. 1900 కు ముందు అమెరికాలో లంగ్ క్యాన్సర్ కేసులు 150. బ్లెండెడ్ సిగరెట్ (పంచదార ముంచిన పొగాకుతో తయారైన) 1913 లో రంగ ప్రవేశం చేశాక ఒకే సంవత్సరంలో 400 కేసులు. 1945 నాటికి 12 వేల మంది మరణం. 2005 నాటికి 1 లక్షా 63 వేలకు చేరింది! ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది బలౌతున్నారు. ఇవ్వాళ లంగ్ క్యాన్సర్ ఒక ఎపిడెమిక్… యేదో అక్కినేని వారి సినిమాలో అప్పుడప్పుడూ కనబడ్డ జబ్బు ఎంత మాత్రం కాదు. పొగాకూ, పంచదార కంపెనీలు చెట్టా పట్టలేసుకొని సృష్టించిన ఒక దౌర్భాగ్యం. (గ్యారీ టాబ్స్ రాసిన THE CASE AGAINST SUGAR పుస్తకాన్ని పరిచయం చేస్తూ సమదర్శిని పేరుతో జాస్తి కిషోర్ బాబు గారు రాసిన “పంచదార” పుస్తకం నుండి.) విజయకుమార్ డాక్టర్ #కాన్సర్ వ్యాధి #భారత్ ను సునామీలా చుట్టేస్తున్న కాన్సర్ : డా.నోరి దత్తాత్రేయుడు ! #world cancer day
కాన్సర్ వ్యాధి - ~~ొరిత్రక ೯್ಲ್ತಿಯ శ్లేషణ 9 0 MSasi ವಂಬದ್ು జీలనశైలి వ్యాధులన్నిటికీ మూలం సమదర్శిని ఆరో్ విళ్ఞఞాన ప్రచురణల ~~ొరిత్రక ೯್ಲ್ತಿಯ శ్లేషణ 9 0 MSasi ವಂಬದ್ು జీలనశైలి వ్యాధులన్నిటికీ మూలం సమదర్శిని ఆరో్ విళ్ఞఞాన ప్రచురణల - ShareChat

More like this