#🎀నవరాత్రి పూజా అలంకరణలు✨ #శుక్రవారం #మంగళవారం #సరస్వతి దేవి
#🌅శుభోదయం
*_𝕝𝕝ॐ𝕝𝕝 29/09/2025 - శ్రీ దేవీ శరన్నవరాత్రులు 8వ రోజు - అలంకారం: “ఇంద్రకీలాద్రి”పై అమ్మవారు "శ్రీ సరస్వతీ దేవీ" అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*_శ్రీ సరస్వతీ దేవీ_*
*❀━꧁🔆꧂━❀*
*_శ్లో𝕝𝕝 యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా._*
శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.
*_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ సరస్వతీదేవ్యై నమః 𝕝𝕝卐𝕝𝕝_*
