IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడం టెక్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోననే భయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఊరట కల్పించే విషయం వెలుగులోకి వచ్చింది. దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య వేలల్లో పెరగడమే ఇందుకు కారణం. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య భారీగానే పెరిగింది. వరుస త్రైమాసికాల్లో ఆయా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను పెంచుతుండడంతో […]