🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 29 - 10 - 2025,
వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
శుక్ల పక్షం,
తిథి : *అష్టమి* తె4.26 వరకు
నక్షత్రం : *ఉత్తరాషాఢ* మ1.31 వరకు
యోగం : *శూలం* తె4.25 వరకు
కరణం : *భద్ర* సా4.15 వరకు
తదుపరి *బవ* తె4.26 వరకు,
వర్జ్యం : *సా5.39 - 7.18*
దుర్ముహూర్తము : *ఉ11.21 - 12.06*
అమృతకాలం : *ఉ6.46 - 8.27*
మరల *తె3.34 - 5.13*
రాహుకాలం : *మ12.00 - 1.30*
యమగండం : *ఉ7.30 - 9.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం : *6.01*
సూర్యాస్తమయం : *5.27*
*_నేటి విశేషం_*
*కార్తవీర్య జయంతి*
కార్తవీర్యార్జునుడు శ్రీ దతాత్రేయుని ఆరాధించి స్వామిచే వరాలు పొందిన సహస్ర బాహువులు కలవాడు.
ఈయనను స్మరించినంతనే సమస్త కోర్కెలూ సిద్ధింప చేయువాడు...
*🌺కార్తవీర్యార్జున మంత్రం🌺*
నిరంతరం స్మరిస్తూ ఉంటే పోయినవన్నీ తిరిగి లభిస్తాయి, అది డబ్బైనా, మనశ్శాంతి అయినా లేదా ఇంట్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళయినా మొత్తానికి సమస్య ఏదైనా పరిష్కారం తప్పకుండా లభిస్తుందని చెపుతున్నాయి మన పురాణాలు ..
స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్పూర్తిగా స్మరిస్తే పోయినవి తిరిగి మనకి దక్కుతాయని కూడా చెబుతారు...
*🌹ఓం కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతే*
ఇంతకీ ఈ కార్తవీర్యార్జునుడు ఎవరూ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే ""సుదర్శన చక్రం"" యొక్క అంశ.
తను చేతిలో ఉండటం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించ గలుగుతున్నాడు అనే గర్వం ఏర్పడటంతో అది గ్రహించిన స్వామి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.
కాని భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు...
చేతులు లేకుండా పుట్టిన ఇతను దత్తాత్రేయుడిని పూజించి వెయ్యి చేతులు కలవాడిగా మారతాడు, అందుకే ఇతనిని సహస్రబాహు అని కూడా అంటారు...
అంతేకాదు తనకి కేవలం శ్రీ హరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా పొందుతాడు...
ఇతను ఎంత బలశాలి అంటే అతి పరాక్రమవంతుడైన రావణాసురుడిని ఒక యుద్ధంలో బంధించి తన రాజ్యానికి తీసుకుని పోయి తరువాత పులస్త్య మహర్షి అభ్యర్ధన విని అతనిని వదిలేస్తాడు.
ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మాహిష్మతిపురము.
*ఇతని పురోహితుడు గర్గ మహర్షి*.
ఒకసారి కార్తవీర్యుడు వేట కోసమై అడవికి వెళ్తాడు.
అక్కడ అలసిపోయి దగ్గరలో ఉన్న జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన కార్తవీర్యునికి స్వాగతం పలికి జమదగ్ని విశేషమైన విందు పెడతాడు.
అంత రుచికరమైన ఆహారపదార్థాలు కామదేనువు సంతతి అయిన గోమాత ద్వారా లభించాయన్న నిజం తెలుసుకుని దానిని తనకి ఇచ్చేయ్యమని అడుగుతాడు,
అందుకు జమదగ్ని నిరాకరించటంతో మహర్షి తలను ఖండించి ఆ గోమాతను తీసుకెళ్ళిపోతాడు...
ఆశ్రమానికి తిరిగివచ్చిన జమదగ్ని కొడుకు పరాశరుడు విషయం తెలుసుకుని ""కార్తవీర్యునితో పాటు 21 మంది క్షత్రియులని చంపుతానని శపథం పూనుతాడు"".
అన్న మాట ప్రకారమే కార్తవీర్యుడిని సంహరిస్తాడు,
*పరశురాముడు విష్ణుమూర్తి అవతారం కావటంతో కార్తవీర్యుని కోరిక కూడా తీరి మళ్లీ శ్రీహరి చేతిలో ""సుదర్శునుడిగా "" మారి, గర్వం విడిచిపెట్టి తన జన్మ సార్ధకం చేసుకుంటాడు*.
అలా అతి బలపరాక్రముడు అయిన కార్తవీర్యుడు తనకు లేని చేతులని తపస్సు చేసి పొందటమే కాకుండా శ్రీహరి చేతిలో ప్రాణాలు విడిచి మళ్లీ అతని కుడి చేతిలోనే "సుదర్శన చక్రమై" ఆ జన్మాంతం నిలిచి ఉంటాడు...
*🌺శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం🌾🌺*
*కార్తవీర్యార్జునో నామ రాజ బాహుః సహస్రవాన్*
*తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే* 1
*కార్తవీర్యః ఖలద్వేషీ కృతవీర్యసుతో బలీ*
*సహస్రబాహు శత్రుఘ్నో రక్తవాసా ధనుర్దరః* 2
*రక్తగంధో రక్తమాల్యో రాజాస్మర్తుర బీష్టదః*
*ద్వాదశైతాని నామాని కార్తవీరస్య యః పఠేత్* 3
*సంపదస్తత్ర జాయంతే జనస్తత్ర వశం గతః*
*ఆనయత్యాశు దూరస్తం క్షేమలాభయుతం ప్రియం* 4
*సహస్రబాహుసశరం మహితం*
*సచాపం రక్తాంభరం రక్తకిరీటకుండలం*
*చోరది దుష్టభయ నాశం ఇష్ట తం*
*ధ్యాయేత్ మహాబల విజ్రుంభీత కార్తవీర్యం*
*యస్య స్మరణ మాత్రేణ సర్వదుఖఃక్షయో భవేత్*
*యన్నామాని మహావీర్యార్జునః క్రుతవీర్యవాన్*
*హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికారితం*
*వాంచితార్ధప్రదం సృణాం స్వరాజ్యం సుకృతం యది*
*ఇతి శ్రీ కార్తవీర్యార్జున ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం🌺*
*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023

