ఈరోజు శాసనసభలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (IIULER), ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన, సవరణ బిల్లులను ప్రతిపాదించగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ఏపీకి IIULER మంజూరు చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి శాసనసభ తరపున ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ యూనివర్సిటీని అమరావతిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. దీనికి అనుబంధంగా అసోసియేట్ ఇనిస్టిట్యూషన్స్ (ఆర్బిట్రేషన్ సెంటర్, మీడియేషన్, కన్సల్టేషన్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ లీగల్ ఎడ్యుకేషన్, జ్యుడీషియల్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో అడ్మిషన్లను కూడా 2025-26 లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ యూనివర్సిటీలో 20శాతం సీట్లు రాష్ట్రంలోనే స్థానికులకే ఇవ్వాలని బిల్లులో పొందుపర్చాం. కేవలం లీగల్ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా పిజి, పిహెచ్‌డి వంటి పరిశోధనలకు కేంద్రంగా ఈ విశ్వవిద్యాలయాన్ని తీర్చిదిద్దాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

01:44