💥ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోస్ అసోసియేషన్ — రాష్ట్ర కమిటీ ప్రకటన!
💥ప్రస్తుతం మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం క్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తుఫాను నియంత్రణ మరియు ప్రజల రక్షణ కోసం విశేషమైన కృషి చేస్తోంది.!
💥ఈ సందర్భంలో, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ తరఫున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక పిలుపు —
ప్రతి ఒక్కరు తుఫాను ముందు జాగ్రత్త చర్యల్లో, అలాగే తుఫాను అనంతర కార్యక్రమాలలో పూర్తి సమర్పణతో, మానవతా దృక్పథంతో, ప్రజాసేవ భావంతో పాల్గొనాలి.!
💥ఇది కేవలం విధి మాత్రమే కాకుండా, మన బాధ్యత — ప్రజల పట్ల, సమాజం పట్ల, రాష్ట్ర పట్ల మన ఉద్యోగుల కర్తవ్యం.!
💥ప్రతి ఉద్యోగి తన పరిధిలోని అధికారుల మార్గదర్శకత్వంలో చురుకుగా పాల్గొని సహాయక చర్యల్లో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.!
💥ఉద్యోగిగా బాధ్యతగా పనిచేద్దాం.. NGGO సంఘ పరంగా కూడా చేయూతనిద్దాం.!
💥తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు, ప్రాణ నష్టం తగ్గించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి.
సహకారం, సేవ, సమానభావం — ఇవే మనకు గుర్తింపు తెస్తాయి.!!
--ఏ. విద్యాసాగర్, రాష్ట్ర అధ్యక్షుడు.!
--DV రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.!
🚩🚩 ఆంధ్రప్రదేశ్ ఎన్జీజివోస్ అసోసియేషన్🚩🚩
#Cyclone❤️🙏🏻
#cyclonemontha❤️🙏🏻
#జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #📢డిప్యూటీ సీఎం శాఖలు ఇవే📃 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ 🇵🇱🔯

