#విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️
( Visakhapatnam Local News )
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం
తేది: 08-08-2025
శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం నందు శ్రావణ మాసం సందర్భంగా శ్రావణమాస శుక్రవార విశేష పూజలు,
శ్రావణమాసం మూడవ శుక్రవారమైన ఈ రోజు, శ్రీ సింహవల్లి తాయారు సన్నిధిలో లక్ష్మీ పూజ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో జంటలు పాల్గొని స్వామివారి కృప పొందారు.
అలాగే, శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించబడుతుంది. అనంతరం బేడా మండపం తిరువీధి కార్యక్రమం సాయంత్రం 6:30 వరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడనుంది.
ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై అయ్యారు వారితోపాటు కార్యనిర్వాహణాధికా ఈవో త్రినాధ్ గారు పాల్గొని అమ్మవారి కృప పొందారు.
