#మే డే శుభా కాంక్షలు
మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే డే. ఈ ప్రపంచంలోని భౌతిక సంపద అంతా సృష్టించేది కార్మికుని శ్రమ. పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి విధానాన్ని సమూలంగా మార్చివేసింది కర్మాగార ఉత్పత్తి విధానం. భారీ పెట్టుబడులతో పెట్టుబడిదారీవిధానం వచ్చింది. ఈ క్రమంలో అనారోగ్యకరంగా ఉన్న కర్మాగార పరిస్తితులు, అల్ప వేతనాలు, ప్రమాదాలు, అధిక పనిగంటలు విశ్రాంతి లేకపోవడం మొదలైన ఏన్నో కష్టాలు కార్మికులు ఎదుర్కొన్నారు.
తమ హక్కుల కోసం మెరుగైన పరిస్థితుల కోసం కార్మికులు ఉద్యమించారు. కార్మికులు కర్షకులు తమ ఉద్యమ స్పూర్తికి గుర్తు గా ప్రతి సంవత్సరం మే నెల ఒకటిన ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకుంటారు