ShareChat
click to see wallet page
#తెలుసుకుందాం #తెలుసుకుందాం..రండి? *✅ తెలుసుకుందాం ✅* *🛑నేలలో దొరికే బొగ్గుతో విద్యుత్‌ ఎలా తయారుచేస్తారు?* 🟢బొగ్గు ఒక ఇంధన మూలకం (elemental fuel). అంటే అందులో చాలా అధిక మోతాదులో రసాయనిక శక్తి దాగుంది. ఆ రసాయనిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియ ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో (thermal power station) జరుగుతుంది. గనుల్లో దొరికే మలిన బొగ్గును కర్బనీకరణం అనే ప్రక్రియలో శుద్ధి చేసిన తర్వాత బాగా ఎండబెట్టి థర్మల్‌ స్టేషన్‌లలో గాలి సమక్షంలో మండిస్తారు. ఆ మంటలో వెలువడిన ఉష్ణంలో నుంచి నీటని ఆవిరి అయ్యేలా చేస్తారు. అధిక పీడనంలో ఈ వేడినీటి ఆవిరిని గొట్టాల ద్వారా పంపి గొట్టాల చివర ఉన్న టర్బైనులను తిప్పే ఏర్పాటు ఉంటుంది. ఈ టర్బైనులో ఒక విద్యుదయస్కాంత స్తూపం సెకనుకు 50 సార్లు తిరిగేలా నిర్మాణం ఉంటుంది. అయస్కాంత క్షేత్రంలో ఓ విద్యుత్తీగ కదిల్తే ఆ తీగలో ప్రేరణ విద్యుత్తు పుడుతుందనే ఫారడ్‌ నియమానుసారం అక్కడి విద్యుత్తీగల్లో ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌ (ac)పుడుతుంది. టర్బైను బ్లేడులను యాంత్రిక శక్తిలో తిప్పిన తర్వాత శక్తిని కోల్పోయిన నీటి ఆవిరిని తిరిగి పునర్వినియోగం ద్వారా వాడుకుంటారు. కొంత వృథా అవుతుంది కూడా. మొత్తమ్మీద బొగ్గులో ఉన్న రసాయనిక శక్తిని మొదట టర్బైనులకు యాంత్రిక శక్తిగా మార్చి ఆ యాంత్రిక శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే ప్రక్రియ ద్వారా ఉష్ణ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ పుడుతుంది.

More like this