ShareChat
click to see wallet page
#శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు బురుజుపేట, విశాఖపట్నం 🙏🕉️🔱🕉️🙏 #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🛕మా గ్రామ దేవత 🚩 #గ్రామ దేవత 🔔 *అమ్మ దయ*🔔 గ్రామదేవతయే గ్రామానికి అధిష్టాన దేవత. గ్రామదేవతలను ఈ రోజున మనం మర్చిపోతున్నాం కాని మన సంస్కృతిలో గ్రామదేవతలకు పెద్దపీట వేశారు. గ్రామదేవతలు ఆదిశక్తి అంశలు, ప్రకృతి శక్తులు అంటుంది దేవీ భాగవతం. పేర్లు ఏవైనా కావచ్చు, ఆరాధానపద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒక్కటే. దేశమంతా ప్రతి ఊళ్ళో ఒకటే శక్తిని కొలుస్తోంది. మనం ఉండే ఊరి నుంచి ఇతర ప్రదేశానికో, లేక తీర్ధయాత్రకో తరలిపోయే ముందు, మనం నివసిస్తున్న ఊరి గ్రామదేవతను దర్శించాలి. సర్వదా సర్వదేశేషు పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానంద రూపిణీ సకల భువనాలకు ఈశ్వరి, మహామాయ, జగత్తును భరించే దానివి, సచ్చిదానందస్వరూపిణి, ఓ అమ్మా! ఎల్లప్పుడూ, అన్ని ప్రదేశాల్లో నన్ను రక్షించు అని శ్లోకార్ధం. శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నం బురుజుపేటలో వెలసి ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లిగా, కోరికొలిచినవార్కి కొంగు బంగారమై... గోపురం లేని గుడిగా, ఏ వేళలోనైనా భక్తులు దర్శించుకునేందుకు 24 గంటలూ తెరిచి ఉంచే ఆలయం... స్థానిక కథనం ప్రకారం, సంవత్సరం 1912 లో, దేవత శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారు యొక్క విగ్రహం స్తాపించారు. ఇది మున్సిపల్ లేన్ నడుమ, రహదారి మధ్యలో నిలబెట్టారు. రహదారిని విశాలం చేయటానికి గాను మున్సిపల్ అధికారులు, రోడ్ మధ్యనుండి రహదారి ఒక మూలకు అమ్మవారి విగ్రహాన్ని మార్చారు. ఈ సమయంలో కాలం సంవత్సరం 1917 ప్రమాదకరమైన అంటువ్యాధి పట్టణం లో ప్లేగు 'వ్యాప్తి చెందింది , మరియు చాలా మంది చనిపోయారు. విశాఖపట్నం ప్రజలు ఈ సంఘటన కు భయపడ్డారు. ఇంత వినాశనం ఎందువల్ల జరిగిందో ఆలోచించారు అప్పుడు దేవత శ్రీ కనక మహా లక్ష్మి ', యొక్క విగ్రహం యొక్క బదిలీ వలన అని తెలిసి ,రహదారి మధ్యలో, దాని అసలు స్థానం కి అమ్మవారి విగ్రహాన్ని మళ్లీ నిలబెట్టిరి. ప్లేగు 'వ్యాధి నయమయ్యింది. మూలవిరాట్టుకు భక్తులే స్వయంగా ఎవరికి వారే అమ్మవారికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, కొబ్బరికాయలు కొట్టి నివేదించి సేవించుకొనే సంప్రదాయం.ముఖ్యంగా స్త్రీలు ఐదవతనాన్ని ఇనుమడింప జేసే దేవతా మూర్తిగా అర్చించి... అమ్మవారిచే, ఇష్టమైన ప్రీతికరమైనపూజలు అందుకొని... కోరిన వరాలిచ్చి అమృతమూర్తిగా... ఇలవేల్పుగా భాసిల్లుతున్న తల్లే శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు. అమ్మదయ ఉంటే అన్నీఉన్నట్లే. https://youtu.be/nfbQ2Ewwq1k 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు
బురుజుపేట, విశాఖపట్నం
 🙏🕉️🔱🕉️🙏 - SriKonctoMMoholclshiit SriKonctoMMoholclshiit - ShareChat

More like this