ShareChat
click to see wallet page
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 *పురుషోత్తమ క్షేత్రం* మన దేశంలోని పూరీ, బదిరీనాథ్, ద్వారక, రామేశ్వరంలలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చార్ ధాంగా పిలుస్తారు. వాటికి చాం హోదా కల్పించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. వీటిలో పూరీలోని జగన్నాధస్వామి ఆలయం అనేక విశిష్టతలతో విరాజిల్లుతోంది. ఒడిశా రాష్ట్రం లోని జిల్లా కేంద్రమైన పూరీలో వెలసిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా సందర్శిస్తే జన్మసార్థకమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రఖ్యాత క్షేత్రాన్ని 'సర్వం జగన్నాథం' అని అభివర్ణిస్తుంటారు. చెన్నై- హౌరా మార్గంలో ఖుర్దారోడ్ అనే రైల్వే కూడలి ఉంది. అక్కడి నుంచి 44 కి.మీ. దూరంలో సాగర తీరాన పూరీ పట్టణం ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైంది. గతంలో పూరీని పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం అనే పేర్లతో పిలిచేవారు. ఈ ఆలయ విమాన గోపురం 192 అడుగుల ఎత్తున ఉంటుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి, చుట్టూ ఎత్తయిన ప్రాకారం కలిగి ఉంది. ఆలయ గోపురంపైగల సుదర్శన చక్రం, జండా భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఎటువైపునుంచి చూసినా ఒకే విధంగా ఉంటాయి. ఆలయ గోపుంపై పక్షులు ఎగరవు. విమానాలు సరేసరీ, ప్రకృతి నియమా లకు విరుద్ధంగా బంగాళఖాతంలో ఎగిరే కెర టాలు కనుల విందు చేస్తుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 120 మేరకు ఆలయాలు, ఉపాల యాలున్నాయి. ప్రధానాలయంలో జగన్నాథుడు (శ్రీకృష్ణుడు), బలరాముడు, వారి సోదరి సుభద్ర దివ్య మంగళ విగ్రహాలు దర్శనమిస్తాయి. *రథయాత్ర:* ఆషాడ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం రథ యాత్ర దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తజన సందోహంతో ప్రతిధ్వనిస్తుంది. ప్రపం చంలో ఏ హిందూ దేవాలయంలోనైనా సరే ఊరే గింపునకు మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు నకు ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఈ సంప్రదాయాన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. ఏటా కొత్త రథాలను శోభాయాత్రకు వినియోగించడం పూరీ ప్రత్యేకత. జగన్నాథడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర విగ్రహాలను ఏటా ఓసారి మందిరం నుంచి బయటకు తీసుకొనివచ్చి కొత్తర థాలపై అధిష్టింప జేస్తారు. జగన్నాథుని రథాన్ని 'నందిఘోష', బలరాముని రథాన్ని 'తాళధ్వజం', సుభద్ర రథాన్ని 'పద్మ ద్వజం' అని పిలుస్తారు. రథయాత్రను పూరీ సంస్థానాధీశ కుటుంబానికి చెందిన వారు ప్రారంభిస్తారు. ఆ పిమ్మట “జై జగ న్నాథ్" అనే నినాదాలు మిన్నుముట్టగా తాళ్ళతో రథానికి కట్టి లాగుతారు. భక్తుల తొక్కిసలాటలో ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగినా, రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. జగన్నాథుని ఆలయం నుంచి 2.5 కి. మీ. దూరంలో ఉండే గుండిచారాణి గుడికి చేరుకొనేసరికి పన్నెండు గంటల సమయం పడుతుంది.. గుండిబా ఆల యానికి చేరిన తరువాత ఆ రాత్రి బయటే రథా లను ఉంచి మర్నాడు ఉదయం మంగళవాయి ద్యాలు మార్మోగగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. నవరాత్రులు అక్కడ ఉంచిన పిమ్మట దశ మినాడు మారురథయాత్ర (తిరుగు ప్రయాణం) మొదలవుతుంది. దీని "బహుదా యాత్ర" అని పిలుస్తారు. ఆ పిమ్మట విగ్రహాలను మళ్లీ గర్భగు డిలోని రత్న సింహాసనంపై అధిరోహింపజేస్తారు. ఆ విగ్రహాలు విలక్షణం: పూరీ జగన్నాథుని రూపం విలక్షణంగా కన్పిస్తుంది. విగ్రహాలు కొండ్యతో నిర్మించినవే. విగ్రహాలు పెద్దపెద్ద కళ్ళలో ఉంటాయి. కాళ్ళు, చేతులు, చెవులు, పెద వులు లేకుండా ఉంటాయి. నడుం కింది భాగం. ఉండదు. అనకూడదుగాని దివ్యాంగుల తర హాలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సంబం ధించిన స్థలపురాణం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. *స్థలపురాణం* ఇంద్రద్యుమ్నడనే మహరాజుకు విష్ణుమూర్తి కలలో కన్పించి చాంకీ నదీ తీరానికి 3 దారువులు (పెద్ద కర్రలు) కొట్టుకువస్తాయని, వాటిని విగ్రహా లుగా రూపొందించాలని సెలవిచ్చాడు. నదీ తీరంలో లభించిన దారువులతో విగ్రహాలుగా తీర్చిదిద్దేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవ శిల్పి విశ్వకర్మ ఓ రోజున రాజువద్దకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. తాను విగ్రహా లను రూపొందిస్తానని చెబుతాడు. అయితే ఇందుకు ఓ షరతు విధిస్తాడు. శాస్త్ర సంప్రదా యాల మేరకు ఈ దారువులను 21 రోజులు తదేక దృష్టితో పనిచేస్తేగాని విగ్రహాలు తయారుకావని, అంచేతన నిష్టకు భంగపరచకూడదని పేర్కొ న్నారు. పైగా తలుపులు వేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు అంగీకరించాడు. నీలాద్రి సమీపంలో తాను నిర్మించిన ఓ మంది రంలో ఆ వృద్ధ శిల్పికి ఆశ్రయం కల్పించాడు. అలా 17 రోజులు గడిచాయి. 18వ రోజున ఇంద్ర ద్యుమ్నుని కుటుంబ సభ్యులు వృద్ధ శిల్పికి అన్న, పానీయాలను అందించాలని కోరారు. వారి మాట కాదనలేక భోజన, ఫల, పానీయాలతో ఆలయా నికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టించి లోపలకు వెళ్లి చూడగా శిల్పి కనబడలేదు. అంగహీనమైన, అసంపూర్ణమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారని స్పష్టమవు తోంది. ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మరో విశేషమే మిటంటే ఆషాఢం అధిక మాసంగా వచ్చిన ఏడాది పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహా లను రూపొందించి ప్రతిష్ఠింప జేస్తారు. దీన్ని "నవకళేబర వత్సవమని” పిలుస్తారు. మూడేళ్ళకొ కసారి ఇలా జరుగుతుంది. ఇక ఇంద్రద్యుమ్నుని వారసుడైన యయాతికేసరి స్వామిగారికి గుడి కట్టించినట్టు తాళపత్ర గ్రంథాలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని క్రీ.శ. 1140 ప్రాంతంలో చాడగంగ దేవుడు, అతని కుమా రుడు అనంగ మహాదేవుడు పరిపూర్ణ స్థాయిలో, అద్భుత కళానైపుణ్యంతో నిర్మింపజేసారు. కాగా గుడించా మందిరం గూర్చి ఓ మాట చెప్పాలి. ఇంద్రద్యుమ్నుని భార్య గుడించా. జగన్నాథ, బల భద్ర, సుభద్రల విశ్రాంతి కోసం ప్రధానాలయానికి సమీపంలో ఓ మందిరం నిర్మించింది. అదే గుడించా మందిరం. రథయాత్రలో భాగంగా అక్కడకు తీసుకువెళ్ళే మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నపీఠంపై కూర్చొండపెట్టి గుడించా దేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఓ విధంగా చెప్పా లంటే గుడించా మందిరం జగన్నాథుని విడిది. గృహం అన్నమాట. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 - phai phai - ShareChat

More like this