సింగపూర్‌లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలతో ఐదు గంటల పాటు గడపడం నాలో సంతృప్తిని నింపింది. కష్టపడే తత్వం ఉన్న తెలుగు జాతి ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించి తెలుగునేల ప్రతిష్టను మరింత పెంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 120కి పైగా దేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు ఆయా దేశాల అభివృద్ధిలో భాగస్వాములవుతూ సేవలందిస్తున్నారు. ఏ దేశంలో చూసినా అందరికంటే తెలుగువారి తలసరి ఆదాయమే ఎక్కువగా ఉండటం గర్వించవలిసిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీరో పావర్టీ-పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని డయాస్పోరా వేదికపై నుంచి నేను కోరగా... దానికి వారంతా సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. #APatSingapore

