ShareChat
click to see wallet page
#పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #శ్రీ జగన్నాథుని రథయాత్ర 🛕గుండిచా మార్జనమ🙏 *పూరీ జగన్నాథ ఆలయం గురించి ఎవరికీ అంతుచిక్కని మిస్టరీలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకొందామా..* గణగణ మోగే గంటలు, బ్రహ్మాండమైన 65 అడుగుల ఎతైన పిరమిడ్ నిర్మాణం, అద్భుతంగా చెక్కిన ఆలయంలోని చిత్రకళలు పూరీ జగన్నాథ్ ఆలయ ప్రత్యేకతలు. కృష్ణుడి జీవితాన్ని వివరంగా కళ్లకు కట్టినట్టు చూపించే స్తంభాలు, గోడలు ఆలయానికి మరింత శోభ తీసుకొస్తాయి. జగన్నాథ ఆలయాన్ని ప్రతి ఏడాది లక్షల భక్తులు సందర్శిస్తారు. ఆలయంలో చాలా ప్రసిద్ధమైనది, ప్రత్యేకమైనది జగన్నాథ రథయాత్ర. ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలో ఈ పూరీ జగన్నాథ ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1078లో పూరీలో నిర్మించారు అయితే ఈ ఆలయం కూడా అన్ని ఆలయాల మాదిరిగానే గోపురం, దేవుడు, గంటలు, ప్రసాదం అన్నీ ఉన్నప్పటికీ.. అన్నింటికంటే చాలా ప్రత్యేకమైనది, విభిన్నమైనది. జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవం కొలవైన ఈ ఆలయంలో ప్రతీదీ చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఈ జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని, నమ్మకం కుదరని ఎన్నో నిజాలు ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఫ్లాగ్ : ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన ఫ్లాగ్ చాలా ఆశ్చర్యకంగా ఉంటుంది. సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపు వీస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గాలిదిశకు వ్యతిరేకంగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. సుదర్శన చక్రం : పూరీలో అత్యంత ప్రసిద్ధి చెందిన జగన్నాథ ఆలయం చాలా ఎతైనది. మీరు పూరీలో ఎక్కడ నిలబడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీవైపు తిరిగినట్టు కనిపించడం ఇక్కడి ప్రత్యేకత. అలలు : సాధారణంగా తీర ప్రాంతాల్లో పగటిపూట గాలి సముద్రంవైపు నుంచి భూమివైపుకి ఉంటుంది. సాయంత్రం పూట గాలి నేలవైపు నుంచి సముద్రంవైపుకి వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం. దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.   పక్షులు : జగన్నాథ టెంపుల్ పైన పక్షులు అస్సలు ఎగరవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు.   గోపురం నీడ : పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఏ మాత్రం కనిపించదు. అది పగలైనా, సాయంత్రమైనా.. రోజులో ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు. ఇది దేవుడి కోరికనో లేదా నిర్మాణంలోని గొప్పదమో మరి.   ప్రసాదం : పూరీ జగన్నాథ ఆలయంలో తయారు చేసే ప్రసాదాన్ని ఎవరూ వేస్ట్ చేయరు.   అలల శబ్ధం : సింహ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ.. ఒక్క అడుగు గుడిలోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్ధం ఏమాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగుపెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది. అయితే సాయంత్రంపూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు.   కారణం.. ఇద్దరు దేవుళ్ల సోదరి సుభద్రాదేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరడం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెబుతారు. అంతేకానీ దీనివెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు.   రథయాత్ర : పూరీ జగన్నాథ రథయాత్రకు రెండు రథాలు లాగుతారు. శ్రీమందిరం, గుండీచా ఆలయానికి మధ్యలో నది ప్రవహిస్తుంది. మొదటి రథం దేవుళ్లను రథం వరకు తీసుకెళ్తుంది. ఆ తర్వాత మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రథం దేవుళ్లను గుండీచా ఆలయానికి తీసుకెళ్తుంది.   రథాలు : పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముల విగ్రహాలను ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి.   బంగారు చీపురు : రథయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చి, తాళ్లను లాగడంతో రథయాత్ర ప్రారంభమవుతుంది.   విగ్రహాలు : ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు. గుండీచా ఆలయం : ప్రతి ఏడాది రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచా ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే.. రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక మిస్టరీ. సాయంత్రం ఆరుగంటల తర్వాత ఆలయ తలుపులు మూసేస్తారు.   ప్రసాదంలోని మిస్టరీ : ఈ పూరీ జగన్నాథ ఆలయంలో దేవుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆలయం సంప్రదాయం ప్రకారం ఈ వంటకాలను ఆలయ వంటశాలలోని మట్టికుండల్లో తయారు చేస్తారు. మరో విశేషమేంటో తెలుసా.. దేవుడికి సమర్పించక ముందు ఈ ప్రసాదాల నుంచి ఎలాంటి వాసన ఉండదు, రుచి ఉండదు. కానీ దేవుడికి సమర్పించిన వెంటనే ప్రసాదం నుంచి ఘుమఘుమలతో పాటు రుచి కూడా వస్తుంది. #namashivaya777
పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు - ShareChat

More like this