#చ రిత్రలో నే డు✍️🥇🏆
🤔ఎంత బలగమున్నా ఒక్కరు!
వెంట రారురన్నా ఎవ్వరు!
!!ఒంటరిగానే పొయెజీవిని!!
ఆపిన ఆగూనా నాయన్నా//ఎంత//
1)ఎవరికి ఎవరన్నా తోడు!
ఉండ బోరురన్నా జోడు!
కాలచక్రము తిరిగే విధమూ!
జీవితిరుగురన్నా చిన్న//ఎంత//
2)ఋణకర్మాలన్నా మనకు!
తప్ప బోవురన్నా తిప్పలు!
!!బ్రహ్మ రాసిన రాతమారదు!!
చేసిన తప్పుల శీక్షలు తీరవు//ఎంత//
3)రామనామమన్నా నేను!
పలుక బోతిరన్నా ఎన్నడు!
!!పెద్దలు చెప్పిన మాటవినకను!!
వ్యర్తుడ నైతిని చిన్నన్నా//ఎంత//
!! శ్రీ రాం జయరాం జయ జయ రాం!!
!! శ్రీ రాం జయరాం జానకిరాం!!
రచన తాటికొండ రాజేశ్వర్ పద్మశాలి
మండలం భోథ్ జిల్లా అదిలాబాద్

