*సంక్రాంతి*
నిత్యం ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనంలో..
కూసింది కోయిలమ్మ
వసంతంలా సంక్రాంతి
పండుగ శెలవులు వచ్చాయని.. ఆకాశం వైపు గాలి పటాలను ఎగరేస్తూ విహంగంలా
మనసు ఓలలాడిన క్షణాలు..
కోడి పందాలు ఎడ్ల బండ లాగుడు పోటీలు బొమ్మల కొలువుతో
భోగి పళ్ళ పేరంటంతో
రాజు పేద తేడా లేకుండా
కలిసిన మనసుల
*మట్టి బంధం*
మమతలు కురిపించిన తల్లి ఒడిలో గారాబాలు..
తండ్రి చేయి పట్టుకుని నేర్పించిన నడకలు..
తాతలు బామ్మలు మన కోసం చిన్న పిల్లలుగా మారి..
వెన్నెల వర్షంలో నులక మంచంపై
వీనులకు అమృతంలా మనసున గాఢంగా ముద్రించిన..
పల్లె పదాలు కధలతో నిద్ర పుచ్చిన క్షణాలు రారమ్మని పిలిచాయి..
చెట్టు మీద చిలక కొట్టిన జామకాయ రుచిని..
పచ్చి మామిడికాయను కాకెంగిలితో పంచుకున్న అనుభవాలు..
భవిష్యత్తు జీవితానికి
పలకా బలపం పట్టి..
తొలి అక్షరాల అడుగుల
సంతకం చేసిన బడి పిలుస్తుంది.. తీగెలు అల్లుకున్న పందిరిలా ఊరంతా ఏకతాటిపై నిలిచిన *మమతల కోవెలలా*..
చిన్ననాటి ఆశల సుగంధాలు పంచిన స్నేహంలా..
పచ్చని ప్రకృతిలో స్వఛ్చమైన గాలి అందించిన
*ఊపిరి ఊయలలో*.. ఊగిసలాడిన స్వఛ్చమైన పల్లెటూరి ఏటిగాలి పరవశంతో *ఊరు పిలుస్తుంది*రా రమ్మని..! #షేర్ చాట్ బజార్👍 #📙ఆధ్యాత్మిక మాటలు #🙏🏻కృష్ణుడి భజనలు #🔱రుద్రాభిషేకము #🎶భక్తి పాటలు🔱
*గోవర్ధన్ ఆముదాలపల్లి*


