ShareChat
click to see wallet page
search
🙏🙏Praise the Lord 🙏🙏 దేవునిని నమ్ముకున్నాను కదా ఎందుకీ కష్టాలు,🙆🏻‍♂️ ఎందుకిన్ని సమస్యలు,🙆🏻‍♂️ ఎందుకీ అవమానాలు,☹️ ఎందుకిన్ని అపజయాలు,🙆🏻‍♂️ ఎందుకింత ఆవేదన అని ఆలోచిస్తున్నావా..??🤔🤔 ఎంతగా దేవునితో సహవాసము చేసినా ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తున్నావా..??🤔🤔 భయపడకు నేస్తమా..🙅🏻‍♂️🙏🏻 ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు.🗣️🗣️ వాక్యం ఈలాగు సెలవిస్తుంది..📖📖 ప్రస్తుతమందు సమస్తశిక్షయు(ప్రతీ సమస్య,కష్టము,శ్రమలన్నీ) దుఃఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి (దానిని సహించినవారికి) అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. Hebrews(హెబ్రీ పత్రిక):12:11 నిజమే..✅✅ ఇప్పుడు మనముందున్న పరిస్థితులు, సమస్యలు అన్నీ మనకు దుఃఖాన్నే కలిగించొచ్చు.✅✅ కానీ వాటన్నిటినీ సహించుదాం.. దేవుడే మనకు సమాధానకరమైన పరిస్థితులు, సమాధానకరమైన ప్రతిఫలమిస్తాడు.✅ ఒక్కటి గుర్తుపెట్టుకో..🧏🏻🧏🏻 సహిస్తేనే సాక్ష్యం ఉంటుంది.✅ సహించకపోతే సాక్ష్యం రాదు.🙅🏻‍♂️🙅🏻‍♂️ ఒకసారి నాకు ఇలా అనిపించింది..🧏🏻🧏🏻 ఆదికాండం (ఆదాము) నుండి ప్రకటన గ్రంధం(యోహాను) వరకు ఎందరో భక్తులు జీవించి ఉండొచ్చు,🤷🏻‍♂️🤷🏻‍♂️ కానీ కొంతమంది మాత్రమే బైబిలు గ్రంధంలో వ్రాయబడ్డారు.✅ మిగిలినవారి పేరులు పరిశుద్ధ గ్రంధంలో వ్రాయబడలేదు.🤷🏻‍♂️🤷🏻‍♂️ ఎందుకో తెలుసా..🧏🏻🧏🏻 సహించినవారు మాత్రమే సాక్ష్యం పొందుకున్నారు.✅ వారు మాత్రమే పరిశుద్ధ గ్రంధంలో లిఖించబడ్డారు.✅ ఈ దినమున మనము ప్రతీ విషయంలో సహించగలుగుతున్నామా..??🤔🤔 సహిస్తేనే సాక్ష్యం.✅ సాక్ష్యమే ఈ మన జీవిత గమ్యం.🙏🏻 మన పరిస్థితులను బాగు చేయడం దేవునికి అంత పెద్ద సమస్య కాదు నేస్తమా..🙅🏻‍♂️🙅🏻‍♂️ ఆయన తలచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో.. కష్టపడి, శ్రమలననుభవించి, సహించి, భరించి దేవునినే ఆశ్రయిస్తూ ముందుకెళ్లే జీవితం ఎప్పుడు వెనుదిరుగదు.✅ కానీ ప్రార్ధించిన ప్రతీసారి జవాబు వచ్చేస్తే ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో శ్రమలొచ్చినా, కష్టాలొచ్చినా కీడు కలిగినా అమ్మో అని అనుకుని వెనుదిరిగిపోయే అవకాశం ఉంది.✅ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు మన విశ్వాసము చెక్కుచెదరలేనట్టే ఉంటాది. కానీ కష్టం, శోధన వచ్చినప్పుడే ఆ విశ్వాసము ఎలాంటిదో తెలుస్తాది.✅ మన విశ్వాసం శ్రమలు, శోధనలగుండా వెళ్తూ సహిస్తూ ముందుకెళ్తుంటే విశ్వాసం అంతకంతకు ధృడపరచబడుతుంది.✅🙏🏻 కాబట్టి.. కీడు వెనుక మేలు దాగియుందని ఎరిగి నిశ్చింతగా ముందుకు సాగుదాం.🙏🏻🙏🏻 ఎదురయ్యే ప్రతీ సమస్యను సంతోషంగా ఎదుర్కొని నీ మేలుకొరకె అని సహించుదాం. ఉన్నతమైన బహుమానము దేవునినుండి పొందుకుంటానని నమ్మి జీవితాన్ని కొనసాగించుదాం. ఎన్ని శోధనలైనా సహించుదాం.. దేవుడే మనకు మేలును ప్రతిఫలముగా ఇవ్వబోతున్నాడు,ఇస్తాడు..ఆమెన్..!! ఆమెన్..!! అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్..!! ఆమెన్..!! God bless you. #📕బైబిల్ వాక్యాలు #✝జీసస్ #🔱దేవుళ్ళు #✝యేసయ్య ఆదరణ📿 #యేసయ్య దీవెనలు
📕బైబిల్ వాక్యాలు - Wait on God timing Trust His HE WILL MOVE ON YOUR BEHALF Wait on God timing Trust His HE WILL MOVE ON YOUR BEHALF - ShareChat