ShareChat
click to see wallet page
search
*కలామ్‌కు ముందు వాజ్‌పేయీని రాష్ట్రపతి అభ్యర్థిగా అనుకున్నారట!* * ఏపీజే అబ్దుల్‌ కలామ్‌కు ముందు 2002లో వాజ్‌పేయీ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా భాజపా ప్రతిపాదించిందట. వాజ్‌పేయీ మీడియా సలహాదారు అశోక్‌ టండన్‌ రాసిన పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోవైపు ఆడ్వాణీకి ప్రధాని పదవి ఇవ్వాలనుకున్నారట. అశోక్‌ టండన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని వాజ్‌పేయి తిరస్కరించారు. ప్రజాదరణ పొందిన ప్రధానమంత్రి మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతి కావడం ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని ఆయన నమ్మారు. ఇది చాలా తప్పుడు ఉదాహరణను చూపుతుందని వాజ్‌పేయీ పేర్కొన్నారు. #news #politics #sharechat
sharechat - ShareChat